Home Cinema Pawan Kalyan: కారు నడుపుతూ చేతులు వదిలేసిన పవన్ కళ్యాణ్.. ఒక్క గంటలో మొత్తం!

Pawan Kalyan: కారు నడుపుతూ చేతులు వదిలేసిన పవన్ కళ్యాణ్.. ఒక్క గంటలో మొత్తం!

pawan-kalyan-movie-bro-teaser-released

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్, ఆయన ( Pawan Kalyan Bro teaser ) మేనల్లుడు సాయిధర్మతేజ్ కలిసి చేసిన బ్రో సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా సముద్రికని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. టీజర్ లో మొదట సాయిధర్మతేజ వాయిస్ వినిపిస్తుంది. ఏంటిది ఇంత చీకటిగా ఉంది ఎవరూ లేరా అని అడుగుతాడు.

pawan-kalyan-movie-bro-teaser-released

ఎవరు పలకరు.. ఎవరూ లేరా అంటూ.. మాస్టారు, గురువుగారు, తమ్ముడు, అని మూడు సార్లు పిలిచినా.. దానికి రిప్లై లేకపోయేసరికి బ్రో అని అరుస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ మెడలో శివుడి ఓంకారంతో, శివుడి వాహనంపై.. ఓంకార ఉండి దానిపై శివలింగంతో త్రిశూలం తో ఉన్న ఒక లాకెట్ వేసుకొని చిరునవ్వుతో కనిపించడం జరిగింది. అలాగే ( Pawan Kalyan Bro teaser ) పవన్ కళ్యాణ్ కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అని అంటాడు. కాలం అంటే శివుడిని.. శివుడిని కాలంతో కూడా పోలుస్తారు. ఏ సమస్యనైనా కాలమే తీరుస్తుంది అంటే ఆ పరమేశ్వరుడే తీరుస్తాడని అర్థం. అంటే మీ గడియారానికి అందని ఇంద్రజాలమే నేను భగవంతుడిని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అర్థమవుతుంది.

See also  Sreeleela: ఆ హీరోతో అలాంటి పనులు చెయ్యడానికి నేను రెడీ అంటూ శ్రీలీల కామెంట్స్..

pawan-kalyan-movie-bro-teaser-released

ఇక ఈ టీజర్ లో ఒక డైలాగ్ మాత్రం అందరిని చాలా అట్రాక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ సాయిధర్మ తేజ వైపు చూసి.. సినిమాలు ఎక్కువగా చూస్తావ్ ఏంట్రా నువ్వు అని అన్న మాట అందరికీ నవ్వును రప్పిస్తుంది. ఏదేమైనా ఈ సినిమాపై ( Pawan Kalyan Bro teaser ) ఈ టీజర్ చూసిన తర్వాత అభిమానులకు ఇంకా అంచనాల పెరిగాయి. అయితే టీజర్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ డ్రైవింగ్ చేస్తూ కారు స్టీరింగ్ ని ఒక్కసారిగా వదిలేసినట్టు చూపించాడు. మరి ఏం చూసి పవన్ కళ్యాణ్ రెండు చేతులు వదిలేసాడో తెలీదు గానీ.. సినిమాలో అది ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో తెలియదు గానీ.. అక్కడితో టీజర్ ని ఆపేశారు.

See also  Shalini Pandey: కిల్లింగ్ లుక్స్ తో షాలినీ పాండే అందాల ఆరబోత.

pawan-kalyan-movie-bro-teaser-released

ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. సాయిధర్మతేజ్ యాక్సిడెంట్ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది. మొదటి సినిమా విరూపాక్ష కూడా సూపర్ హిట్ అయింది. కనుక ఈ సినిమా కూడా అంతకంటే భారీ హిట్ అవుతుంది కాబట్టి కచ్చితంగా సాయి ధరంతేజ్ టైం బాగుందని.. అందుకే ఇలాంటి ప్రాజెక్ట్స్ లో ఉంటున్నాడని.. కచ్చితంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల రికార్డ్ బద్దలు కొడుతుందని అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఇక యూట్యూబ్లో ఈ టీజర్ రిలీజ్ అయిన కేవలం ఒక గంటలో 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గంటలో ఇంత వ్యూస్ రావడం అంటే మామూలు మాట కాదు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని పవర్ స్టార్ అభిమానులు పరవశించిపోతున్నారు. మరి ఈ సినిమా వాళ్ళ అంచనాలకు తగ్గట్టు హిట్ కొడతాదేమో చూద్దాం..