Pawan Kalyan Huge Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న తదుపరి చిత్రంలో ఆయన మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన చిత్రం వినోదయ సీతంనకు ఇది రీమేక్. మనందరికీ తెలిసిన ప్రముఖ డైరెక్టర్ అలాగే నటుడు అయినటువంటి సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. సేమ్ తమిళ్లో తీసిన ఒరిజినల్ కథకు తగ్గట్టుగా కాకుండా చాలా మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్ ను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాడు.
అయితే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అలాగే మాటలు అందిస్తున్నది ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించిన రోజువారి షూటింగ్ పనులు చకచక ప్రారంభమయ్యాయి కూడా.. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, వారు అలాగే జి స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కనిపించబోతున్న యంగ్ బ్యూటీ కేతిక శర్మ అంటున్నారు. అలాగే చిత్రంలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఒకసారి గమనించినట్లయితే ఎన్నో కలలు ఉన్న ఒక వ్యక్తి అనుకోకుండా ఊహించని కారు ప్రమాదంలో మరణిస్తాడు. తన జీవితంలో మిగిలి ఉన్న ఎన్నో బాధ్యతలను కలిగి ఉండడంతో అతనికి ఆ దేవుడు మరొక 90 రోజులు బతికేందుకు వరమిస్తాడు. ఆ తర్వాత చోటు చేసుకునే పరిమాణాలు ఎలా ఉంటాయి అన్నది ఈ సినిమా కథ. తమిళ సినిమాలో దేవుని పాత్రలో సముద్రఖని నటించాడు. అయితే తెలుగులో ఇదే పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సాయిధరమ్ తేజ్ గా చూపించబోతున్నారు.
అయితే ఈ సినిమాకు (Pawan Kalyan Huge Remuneration) సంబంధించిన పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే మీకు మీరు షాక్ అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్స్ ను మించిపోతూ పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నటించేది కేవలం ఇరవై రోజులు ఐనప్పటికీ, కేవలం ఆ ఇరవై రోజుల సమయానికి పవన్ కళ్యాణ్ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అన్నది లోలోపల మాటలు వినిపిస్తున్నాయి. ఎవ్వరు తీసుకోలేని ఇలాంటి రెమ్యునరేషన్ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి..