Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్రలో నటించి.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రో. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మధ్యలో టీజర్ మరియు సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత అంచనాలు కొంచెం తగ్గాయి. కానీ లాస్ట్ లో ట్రైలర్ రిలీజ్ ( Pawan Kalyan comments on Chiranjeevi ) చేసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగిన తర్వాత.. ఇంకా ఈ సినిమాపై అనేక ఇంకా ఎక్కువ అంచనాలు పెరిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫంక్షన్ తర్వాత ఇంతగా అంచనాలు పెరగడానికి కారణమేమిటంటే.. పొలిటికల్గా ఎంతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడమే..
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అందరూ కూడా ఈ సినిమాని ఎంతో పొగుడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇంకా పొగుడుతూ.. మాట్లాడటం జరిగింది. ఇక బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ మీద చాలా ఇష్టాన్ని చూపిస్తూ.. పొగుడుతూ, ( Pawan Kalyan comments on Chiranjeevi ) నవ్వించారు కూడా. అయితే లాస్ట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్గా, వైరల్ గా మారాయి.పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ.. మా అన్న పేరు మీద నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా.. ఆయనకంటే ఇంకా ఎక్కువ కష్టపడాలని ఆలోచనతోనే నేను ఎప్పుడూ కష్టపడ్డాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరం ఇందులో ఉన్నామని.. ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందని.. కష్టపడితే ఎవరికి ఏదైనా కూడా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కి నచ్చిన హీరో గురించి మాట్లాడుతూ.. ఆయన నచ్చిన హీరో అంటే ఒక్కరే అని.. అది కేవలం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. నాగేశ్వరావు గారు, ( Pawan Kalyan comments on Chiranjeevi ) ఎన్టీఆర్ గారు ఇలా ఎవరైనా ఉండి ఉండొచ్చు గాని వాళ్ళందరూ నేను ఎదిగిన సరికి అంతగా వాళ్ళు లైవ్ లో లేరని.. అందుకే తనకి హీరో అంటే గుర్తొచ్చేది, గుర్తుండిపోయేది చిరంజీవి అని చెప్పారు. అంతేకాకుండా ఇక ఈ సినిమా దర్శకుడు గురించి మాట్లాడుతూ.. అతను తెలుగువాడు కాకపోయినా కూడా అతను స్క్రిప్ట్ చదివి వినిపించేటప్పుడు తెలుగులో చదివి వినిపిస్తుంటే ఆశ్చర్యపోయిన అని చెప్పాడు.
అతను తమిళంలో గాని, ఇంగ్లీష్ లో గాని రాసుకుని తెచ్చి ఉంటారని అలా తెలిసి చదువుతున్నాడని అనుకున్నానని.. కానీ తీరా చూస్తే అది తెలుగులోనే రాసిందని.. దాన్ని అతను చదువుతున్నాడని చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పాడు. మీకు తెలుగు వచ్చా అని పవన్ అడిగితే.. మీతో సినిమా చేయాలనుకున్న తర్వాత రెండు మూడు నెలలుగా నేను తెలుగు చదవడం నేర్చుకున్నాను అని చెప్పాడు. దానితో తెలుగు భాషకు మనం ఎంత గౌరవం ఇవ్వాలని అర్థమైందని.. ఆయన చంప దెబ్బ కొట్టినట్టు అనిపించిందని.. మనకి తెలుగు, ఇంగ్లీష్ రెండూ పూర్తిగా రాదు. అలాంటిది అతని వేరే భాష వాడు మన తెలుగునంత బాగా నేర్చుకున్నాడని.. అందుకే ఈరోజు అతనికి మాట ఇస్తున్నాను.. ఏదోరోజు నేను తమిళ్ కూడా అతని కోసం నేర్చుకుని మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..