Pawan Kalyan – Varun Tej : జూన్ 9వ తేదీ హైదరాబాదులో నాగబాబు ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి పలువురు సినీ ప్రముఖులు.. ముఖ్యంగా మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం అటెండ్ అయ్యారు. నిన్న జరిగిన ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో ( Pawan Kalyan attend for Varun ) కొంచెం కొంచెంగా బయటికి వస్తూ ఉంటే వాటిని చూసి ఎంతో ఆనందంగా నెటిజనులు చూసి షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ప్రేమ ఇప్పటికే ఒకటి కాబోతుందని.. ఒకరుగా జీవించడానికి కావాల్సిన పునాది వేసుకున్నారని.. ఇక పెళ్లి కూడా తొందరగా అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నారు.
అయితే మొదటి నుంచి ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి వాళ్ళు వస్తారు, వీళ్ళు రారు, ఎందుకు వస్తారు? అందుకు రారు అంటూ.. ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదట్లో ఉపాసన ఎంగేజ్మెంట్ కి రాదని.. ఎనిమిదో నెల కాబట్టి చాలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె చక్కగా ఎంగేజ్మెంట్ కొచ్చి ఫోటోలు ( Pawan Kalyan attend for Varun ) తీసుకొని ఆనందంగా ఎంజాయ్ చేసి వెళ్ళింది. అలాగే ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాలేరని.. అటు రాజకీయాల్లో, సినిమాల్లో కూడా చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వేడుకలకు రాలేరని ఎన్నో వార్తలు వచ్చాయి. ఎంత బిజీగా ఉన్నా.. ఏం చేసినా.. ఇంట గెలిచే రచ్చ గెలవమని పెద్దలు అన్నారు.
అంటే ఇంట్లో వాళ్లకి కావాల్సినవి చూసుకొని.. ఆ తర్వాతే బయట ఏదైనా అని అనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎంత బిజీగా ఉన్నా.. తన అన్న కొడుకు ఎంగేజ్మెంట్ కి చక్కగా వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతున్న దగ్గరనుంచి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan attend for Varun ) లోపలకొస్తుండగా నాగబాబు ఎదురెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళుతున్న ఫోటోలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని.. అభిమానులు పొంగిపోతూ షేర్ చేసుకుంటున్నారు. అలా లోపలికి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట అన్నారు.. ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
ఇంతకీ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ తో ఏమన్నాడు అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే.. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇస్తూ.. నవ్వుతూ ఒకటేదో చెప్తున్నట్టు.. అది వింటూ ఉండగా వరుణ్ తేజ్ కూడా నవ్వుతున్నట్టు.. ఆఖరికి నాగబాబు కూడా నవ్వుతున్నట్టు వెనక ఉన్న వాళ్ళు కూడా చిరునవ్వుతో చూస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దీనికి నెటిజనులు మంచి డబ్బింగ్ ఇచ్చుకున్నారు. ఈ ఫోటో చూసి పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ సెకండ్ ఇస్తూ.. ” వద్దురా సోదరా ఈ పెళ్లంటే నూరేళ్ల మంట రా ” అని పాటని చెప్పినట్టు డబ్బింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాపం పవన్ కళ్యాణ్ తనకి పెళ్లంటే.. ఎంత మంటో వరుణ్ తేజ్ కి చెప్తుంటే.. వాళ్ళు నవ్వు ఆపుకోలేక నవ్వుతున్నారని అభిమానులు అనుకుంటున్నారు.