Home Cinema Pawan Kalyan – Prabhas :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్. గాసిప్ కాదు.

Pawan Kalyan – Prabhas :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్. గాసిప్ కాదు.

pawan-kalyan-and-prabhas-multi-starrer-movie-in-talks-here-is-update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ వీళ్ళిద్దరూ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసినదే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే తెరలో కనిపిస్తే సినిమా హాల్స్ ఎలా ఉంటాయి? ఫాన్స్ సందడితో (Pawan Kalyan and Prabhas ) ఆ సినిమా హాల్స్ రూపు రేఖలు మారిపోవచ్చు. ఈ ఇద్దరి హీరోలకి అంత క్రేజ్ ఉంది. అసలు వీళ్ళిద్దరూ ఒకే స్క్రీన్ పంచుకుందామని అనుకున్నా.. దర్శకుడు గాని, కథ రాసేవాడు గాని.. సరిగ్గా వీళ్లిద్దరికీ న్యాయం చేయడం.. ఇద్దరి అభిమానులని మెప్పించడం చాలా కష్టం.

pawan-kalyan-and-prabhas-multi-starrer-movie-in-talks-here-is-update

అయితే పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో చేయబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకే సినిమాలో చెయ్యడం అనే వార్త చాలా ఆనందాన్ని, ఆత్రుతని కూడా అభిమానులకు కలిగిస్తుంది. ఇంతకీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో చేయడం అంటే.. ఇద్దరు హీరోలుగా నటించడం కాదు.. ఓజి సినిమా (Pawan Kalyan and Prabhas ) కోసం టీమ్ లో ప్రభాస్ కూడా కలుస్తున్నాడట. ఓజి సినిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సాయం కావాలని సుజిత్ వెళ్లి ప్రభాస్ ని అడిగారట. ఇంతకీ దర్శకుడి సుజిత్ అడిగిన సాయం ఏమిటంటే..

See also  Niharika: వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా నిహారిక తీసుకున్న ఈ నిర్ణయంతో.. మెగా కుటుంబానికి దూరంగా!

pawan-kalyan-and-prabhas-multi-starrer-movie-in-talks-here-is-update

ఓజీ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కి పవర్ఫుల్ వాయిస్ అవసరం అవుతుందట. అలాంటి వాయిస్ వోర్ ప్రభాస్ తో చేయిస్తే సినిమా అదురుద్దని దర్శకుడు భావిస్తున్నాడట. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాలంటే.. ఆ వాయిస్ వోర్ ప్రభాస్ చేస్తే బాగుంటాదని భావించి (Pawan Kalyan and Prabhas ) దర్శకుడు సుజిత్ ప్రభాస్ ని అప్రోచ్ అయ్యాడట. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సాహూ సినిమా వచ్చిన సంగతి మనకి తెలిసినదే. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉందట. అందుకే సుజిత్ వెనకడుగు వేయకుండా.. ప్రభాస్ ని ఈ విషయం అడగాలని డిసైడ్ అయ్యాడట.

See also  Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

pawan-kalyan-and-prabhas-multi-starrer-movie-in-talks-here-is-update

ఈ విషయం సుజిత్ వెళ్లి ప్రభాస్ ని అడగగా.. ప్రభాస్ ఆ ప్రపోజల్ కి ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతుందని అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి లో మహేష్ బాబు వాయిస్ వోర్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే సునీల్ మర్యాదరామన్న (Pawan Kalyan and Prabhas ) సినిమాలో రవితేజ వాయిస్ వోర్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలో వాయిస్ వోర్ ఇస్తే.. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తాదని అంటున్నారు.