Pawan Kalyan – Allu Arjun : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ ఒకసారి నటించబోతున్నాడు అన్న సంగతి మనందరికీ అఫీషియల్ గా తెలియపరిచారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి ( Pawan Kalyan and Allu Arjun ) కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంటపురం సినిమాలు మూడు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అల్లు అర్జున్ అభిమానులకి త్రివిక్రమ్ తో కలిసి సినిమా అంటే చాలా ఇష్టం. ఇక ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప2 కంప్లీట్ అవ్వాలి.
ఇప్పటికే సినిమా పుష్ప 2 మీద అల్లు అర్జున్ అభిమానులకు, సినీ అభిమానులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే.. పుష్ప మీద పెద్దగా అంచనా లేకుండానే రిలీజ్ అయ్యి సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఇప్పుడు పుష్ప2 మీద కొంత అంచనాలతో ఉండగా.. దాని టీజర్, ట్రైలర్ రావడంతో అవి ( Pawan Kalyan and Allu Arjun ) చూసిన తర్వాత ఇంకా విపరీతమైన భారీ అంచనాలు పెరిగాయి. పుష్ప 2 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడా అని ఆలోచించే అభిమానులకు త్రివిక్రమ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. ఏదేమైనా పుష్ప, పుష్ప 2 ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ జీవితంలో చాలా గట్టి స్థానాన్ని సంపాదిస్తాయని మనందరికీ తెలుస్తూనే ఉంది.
మరి ఆ తర్వాత వచ్చే సినిమానే చాలా జాగ్రత్తగా తీయాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రభాస్ కూడా బాహుబలి, బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమాల్ని ప్రేక్షకుల్ని ఒప్పించడం, నేర్పించడం ఆ సినిమాలతో చాలా కష్టంగానే ఉంటుంది. ప్రతి సినిమాని కూడా బాహుబలి తో పోల్చడం వలన ఆ తర్వాత వచ్చిన మూడు ( Pawan Kalyan and Allu Arjun ) సినిమాలు కూడా సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. మరి అల్లు అర్జున్ విషయంలో అలా జరగకూడదని.. అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే అల్లు అర్జున్ అంత పుష్ప 2 లాంటి ప్రాజెక్టు తర్వాత.. ఇప్పటికే మూడు సినిమాలు వరుసగా హిట్ కొట్టిన దర్శకుడి కాంబినేషన్తో కలిపి మళ్ళీ సినిమా తీయాలని ఆలోచన రావడం అల్లు అర్జున్ సమయస్ఫూర్తి అని అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ కి కూడా ఈ సినిమా ఎంత సక్సెస్ చేస్తే ఆయనకు అంత సక్సెస్ అన్న విషయం బాగా తెలుసు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ట్ అయిన అల్లు అర్జున్కి మళ్లీ ఆ లెవెల్ లో లేదా అంతకంటే ఎక్కువగా అందిస్తే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. అందుకే ఆయన ఈ సినిమానే చాలా చాలెంజ్ గా తీసుకొని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారంట. అందుకే ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో ఒక పది నిమిషాలు పాటు నటింపజేయాలని డిసైడ్ అయ్యారు అంట. అల్లు అర్జున్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడా అని అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒకటి అల్లు అర్జున్ మెగా హీరో, రెండు త్రివిక్రమ్ అంటే పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. మరి ఇదే జరిగి వీళ్లిద్దరూ ఒక స్క్రీన్ మీద కనిపించే ఆ సినిమాని .. మరి పది నిమిషాల్లో ఎంత సంచలనాన్ని క్రియేట్ చేస్తారో వీళ్లిద్దరూ చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. చూడాలి మరి ఈ ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..