Kriti Kharbanda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించినటువంటి చిత్రం లో కృతి కర్బందా కూడా నటించారు. ఈ చిత్రం తోనే తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టిన కృతి తన అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి వచ్చింది. అలా ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించినటువంటి ఒంగోలు గిత్త సినిమా తో పాటు తెలుగులో కొన్ని చిత్రాలలో కూడా నటించింది. కానీ.. ఆమెకి సరైన హిట్టు ఏది అందకపోవడంతో ఆమె ఇక్కడ స్టార్ హీరోయిన్ గా చలా మణి అవ్వలేకపోయింది. ఎన్నో ఆశలతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి తానెంటో నిరూపించుకుందామని అనుకుంది. కానీ సరైన సమయంలో సరైన హిట్ రాలేడు.
దాంతో చేసేది ఏమీ లేక బాలీవుడ్ బాట పట్టింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రంతో హీరోకు చెల్లెలు పాత్రలో కూడా నటించింది. కాగా ఇంటి వలే ఈ హీరోయిన్ గురించి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఆమె తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన మొదట్లో ఆమె కలిగిన ఓ చేదు అనుభవాన్ని తాజాగా ఆమె షేర్ చేసుకుంది. తాను ఓ చిత్రంలో నటిస్తున్న సమయంలో తన గదిలో సీక్రెట్ కెమెరాలు గుర్తించిందని. తనకెంతో కంగారుతో భయం వేసిందని తెలియపరిచింది. ఢిల్లీ బ్యూటీ అయిన శృతి తెలుగులో బోనీ చిత్రంతో హీరోయిన్గా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.
ఇంకా ఈమె హీరోయిన్ గా అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఎక్కువగా దక్షిణాది ఇండస్ట్రీ లలో ఎక్కువగా సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడంలో కూడా పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఇక ఆమె తెలుగులో చివరగా నటించిన చిత్రం బ్రూస్ లీ చిత్రం అయిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టినప్పటికీ గత రెండేళ్లుగా ఎలాంటి సినిమాలలో కూడా ఆమె నటించడం లేదు. అయితే కెరియర్ మొదట్లో ఆమె పలు చిత్రాలలో నటిస్తున్న సమయంలో తన గదిలో సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టారనే గుర్తించిన ఆమె
అక్కడే పని చేస్తున్న ఓ వ్యక్తి సీక్రెట్ గా కావాలని నా రూంలో కెమెరాలు పెట్టాడని తెలియజేసింది. అయితే నాకు ముందు నుండే ఒక అలవాటు ఉంది నేనెప్పుడైనా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడ స్టే చేయాలంటే కచ్చితంగా నా రూమ్ ఎలా ఉంది అని చూసుకోవడం ఆ రూమ్ పూర్తిగా చెక్ చేసుకోవడం అలవాటు.. నాకే కాదు నా టీం కి కూడా అలవాటు.. అలా గదిని మొత్తం పరిశీలించి చూడగా సెటప్ బాక్స్ వెనకాల కెమెరా ని గుర్తించాము. నేను పర్సనల్గా ఉండగా నా వీడియోలు రికార్డ్ చేసేందుకే ఇలాంటి డివైస్ ఇక్కడ పెట్టారని నాకు అర్థం అయింది. అది చూసి నేను ఎంతో షాక్ గురయ్యానంటూ ఇక ఆ తర్వాత నుంచి నేను ఎక్కడైనా కొత్త ప్రదేశంలో బస చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని ప్రతి కృతి (Kriti Kharbanda)వెల్లడించింది.