Pallavi Prashanth : ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ. బిగ్ బాస్ మొదట హిందీ బుల్లితెరపై మొదలై. అది జనాదరణ ఎంతగానో పొంది సూపర్ సక్సెస్ అవ్వడంతో.. దాన్ని పలు భాషల్లో మళ్ళీ తీయడం జరిగింది. అలాగే తెలుగులో కూడా బిగ్ బాస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి.. ఇప్పటివరకు రోజురోజుకు దాని ఆడియన్స్ పెరుగుతున్నారే తప్పా, ఎక్కడ దానిపై ఆసక్తి ( Pallavi Prashanth police searching ) తగ్గేది కనిపించడం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. నాగార్జున హోస్ట్గా చేసిన ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
బిగ్బాస్ సీజన్ సెవెన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టిన సంగతి మనందరికి తెలిసిందే.అలా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ మొదట్లో కొంచెం తరబడినా కూడా.. తర్వాత తన తప్పులను తెలుసుకొని.. టార్గెట్లపై పూర్తి గా ( Pallavi Prashanth police searching ) మనసుపెట్టి శ్రద్ధతో వాటిని పూర్తిచేసుకుని విన్నర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి పల్లవి ప్రశాంత్ సెలెక్ట్ చేసారని తెలిసిన తర్వాత అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ చుట్టుముట్టారు. అక్కడికి రావడమే కాకుండా అక్కడ విపరీతంగా అల్లర్లు చేశారు.
రన్నర్ గా నిలిచిన అమరదీప్, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీత మరికొందరి కార్లపై వాళ్లు దాడి కూడా చేశారు. దీనితో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో అమర్దీప్ కి గొడవ కూడా జరిగింది. ఇవన్నీ కనిపెట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అక్కడి నుంచి బయటికి వాళ్ళ ఎదురుగా వెళ్లడం మంచిది కాదని, వెనుక దారి నుంచి అతన్ని పంపించేసి ఇటువైపుగా ( Pallavi Prashanth police searching ) ఇంక రావద్దని, వస్తే శాంతి భద్రతులు అదుపు తప్పుతాయని చెప్పడం జరిగింది. శాంతిభద్రతల కోసం పోలీసులు అది చెప్పినా కూడా.. పల్లవి ప్రశాంత్ ఆ మాట వినకుండా.. మళ్ళీ కారు విండో నుంచి బయటికి కనబడుతూ స్టూడియో వైపుగా కార్ తిప్పడం జరిగింది. దీనితో అభిమానులు విపరీతంగా బీభత్సం చేయడం జరిగింది.
పోలీసులు ఆ బీభత్సాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అయితే ఇంత ఇంత బీబత్సానికి కారణమైన వాళ్ళు పై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు చెప్పినా కూడా వాళ్ళ మాటలు లెక్కచేయకుండా అటువైపుగా మళ్లీ వచ్చి శాంతిభద్రతలను కోల్పోయేలా చేసినందుకు పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. పల్లవి ప్రశాంథ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్, లా కంట్రోల్ కి సహకరించకపోవడం, రెచ్చగొట్టడం వంటి కేసులు నమోదు చేశారు. ఇది తెలిసిన పల్లవి ప్రశాంత్ పరారీ అయిపోయాడు. అయితే అతని సోదరుడిని, అతని కార్ డ్రైవర్ ని పట్టుకొని పోలీసులు ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా పోలీసులకి శాంతి భద్రతలకు లోపం వచ్చేలాగా పల్లవి ప్రశాంత్ చేయడం బాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.