Allu Arjun : మనిషి బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా కూడా చాలామంది సినిమా రంగాన్ని ఎన్నుకోవడం, అందులో సక్సెస్ అయితే నిజంగా అదృష్టం అనుకోవడం వెనక రీజన్ లేకపోలేదు. సినిమా రంగంలో ఎంత తీసుకున్నప్పటికీ, ఎంత కష్టపడాల్సిన అవసరం వచ్చినప్పటికీ, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సినప్పటికీ ( Female fan for Allu Arjun ) కూడా ఆ రంగం అంటే ఎందుకు ఇష్టపడతారంటే.. అభిమానుల అభిమానం కోసం. కేవలం డబ్బు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా.. అభిమానుల గుండెల్లో వాళ్ళ కోసం ఉండే ప్రేమను సంపాదించుకోవడం కూడా నటీనటులకు చాలా నచ్చుతుంది. అది వాళ్ళ సక్సెస్ కి, వాళ్ళు బ్రతికుండగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికి ఉండేలా చేసే దారికి పునాది.
సాధారణంగా హీరోలకు విపరీతమైన కోర్ ఫాన్స్ ఉంటారు. వాళ్ళ హీరో కోసం ఎవరితోనైనా ఫైట్ చేస్తారు, వచ్చిన రోజునే మార్నింగ్ షో సినిమా చూస్తారు, ఇంకా వాళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అంటే కటౌట్లు కడతారు,పాలాభిషేకాలు చేస్తారు, హీరో ( Female fan for Allu Arjun ) వస్తున్నాడు అంటే రోడ్లమీద పరుగులు పెడతారు, ఇలా వాళ్ళ వీరాభిమానాన్ని ఎంతగానో చూపిస్తారు. వాళ్ళ హీరో సినిమా సక్సెస్ అయితే పండుగ చేసుకుంటారు. ఫెయిల్ అయితే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు బాధతో కృంగిపోతారు. వాళ్ళ హీరో ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుంది అంటే వీళ్ళ ఇంట్లో జరుగుతున్నట్టే సంబరాల్లో మునిగిపోతారు.
ఇలాంటి అభిమానాన్ని మనం చాలాసార్లు, చాలా చోట్ల, చాలామంది హీరోల కోసం చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలుసు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ ఎక్కడకో వెళ్ళిపోయింది. పాన్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత ఆయన అంటే అభిమానులకు ( Female fan for Allu Arjun ) ప్రాణం. మొదటి నుంచి కూడా.. అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ సపోర్ట్ తో వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో తన తనంటూ ఒక దారిలో నటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరో. ఇక అల్లు అర్జున్ అంటే అబ్బాయిలకి, అమ్మాయిలకి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మాస్ యాక్షన్ చేసి, ఫైట్స్ చేసి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసుకుంటే.. ఒక చిన్న చిరునవ్వుతో సొట్టబుగ్గతో అమ్మాయిలను మనసులను దోచేసుకునే హీరో అల్లు అర్జున్.
అల్లు అర్జున్ కోసం ఒక మహిళ వీర అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో అతని గెటప్ ని ఆమె నీటిపై ఆర్ట్ వేసింది. అచ్చం నీటిపై అల్లు అర్జున్ ఇమేజ్ ని దించేసిన ఆమె ఆర్ట్ చూసి.. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వెంటనే అది ఫోటో, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వీడియో వైరల్ అవుతుంది. నిజంగా ఒక ట్యాలెంట్ ని ఆమె అభిమానంతో కలగలిపి.. అంత అద్భుతంగా అల్లు అర్జున్ ఇమేజ్ ని నీటి మీద డ్రా చేయగలిగింది అంటే.. ఆమె మనసులో అల్లు అర్జున్ మీద ఎంతటి అభిమానం ఉందో అని అందరూ అంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ ఇలాంటి అభిమానిని సంపాదించుకున్నందుకు అదృష్టవంతుడనే అనుకోవాలి.