Jr.NTR: ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా చావు బతుకుల మధ్య అల్లాడుతున్నాడు తారకరత్న. వారి కుటుంబ సభ్యులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు తారకరత్న పై ఇంకా కోపం తగ్గలేదని వార్త చెక్కర్లు కొడుతుంది.? మరి ఇలాంటి వార్త జూనియర్ ఎన్టీఆర్ పై రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటో చూద్దాం..నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆ పేరును కొంచెం కూడా వాడుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా పేరుపొందాడు. అదే సమయంలో నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తారకరత్నను చంద్రబాబు నాయుడు చిత్ర పరిశ్రమలోకి లాక్కొచ్చాడు, రావడం రావడం తో ఒకటేసారి తొమ్మిది చిత్రాలను అనౌన్స్ చేయించారని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఇదే విషయం పట్ల ఆమధ్య తారకరత్న ఓ ఇంటర్వ్యూలో అలాంటి గొడవలు మా మధ్య ఏమీ లేవని తెలిపారు. అయితే తాజాగా తారకత్నపై జూనియర్ ఎన్టీఆర్ కు ఇంకా కోపం తగ్గలేదని వార్త వినిపిస్తుంది.దీనికి ప్రధానమైన కారణం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం అమిగో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో అన్న తారకరత్న ఆరోగ్యం గురించి జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన అన్న ఆరోగ్యం బాగుండాలని ఒక్కసారి కూడా గుర్తు చేయకపోవడం గమనార్ధం. ఇదే విషయాన్ని గ్రహించిన కొందరు నందమూరి అభిమానులు, నందమూరి హేటర్స్ తారకరత్న పై జూనియర్ ఎన్టీఆర్ కి అప్పటి కోపం ఇంకా ఉంది కావచ్చు అనుకుంటున్నారు.అందుకనే తన అన్న కోలుకోవాలని ఒక మాట కూడా అన్న గురించి ప్రస్తావించలేదని కామెంట్లు పెడుతున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన అన్న ఆరోగ్యం గురించి చెప్తే అది సింపతి కింద లెక్క అవుతుందని అందుకే తారకరత్న ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదని కామెంట్ చేస్తున్నారు. ఇది కాక అన్నపై కోపం ఉంటే బెంగళూరు హాస్పిటల్లో అన్నను చూడడానికి స్వయంగా ఎందుకు వెళ్తారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.