Home Cinema Chiranjeevi – NTR : చిరంజీవికి ఎన్టీఆర్ అలాంటి సలహా ఇచ్చాడట.

Chiranjeevi – NTR : చిరంజీవికి ఎన్టీఆర్ అలాంటి సలహా ఇచ్చాడట.

Chiranjeevi – NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారి ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిన గొప్ప నటుడు సీనియర్ ఎన్టీఆర్. ఆయన పేరు ఇప్పటికీ, ఎప్పటికీ ( Chiranjeevi – NTR ) చిరస్మరణీయంగా అందరికీ గుర్తుండిపోయే వ్యక్తి ఎన్టీఆర్. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎందరో వాళ్ళ పేర్లను ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని స్థాయిలో పెట్టుకున్నారు. అందులోనే అక్కినేని నాగేశ్వరరావు ఇలా ఎందరో ఉంటారు. అలాగే ప్రస్తుతం చిరంజీవి కూడా అదే స్థాయిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన సైలల్లో తాను నటిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. డ్యాన్సులకి, ఫైట్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమా ( Chiranjeevi – NTR ) ఇండస్ట్రీలో తీసుకువచ్చింది చిరంజీవి అని చెప్పుకోవచ్చు. చిరంజీవి డాన్స్ , ఆయన చేసే ఫైట్స్.. ఆ రోజుల్లో పిల్లలందరికీ విపరీతమైన ఇష్టం. చిరంజీవి ఎంతో క్రమశిక్షణ ఉన్న మనిషిని ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. ఆయన మాట్లాడే విధానంలో ఎప్పుడూ కూడా వినయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

See also  Janhvi Kapoor : జాన్వి కపూర్ తన ఫస్ట్ లవర్ తో అలాంటి స్థితిలో ఇంట్లో ఎవరికి దొరికిపోయిందో తెలుసా?

ఎంత పై స్థాయికి వెళ్లినా కూడా ఆయన ప్రతి మనిషితోను ఎంతో వినయంగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. అలాగే ఆయన పెంపకం.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికీ.. ఎంతో చక్కగా తన ( Chiranjeevi – NTR ) మాటలను, ప్రవర్తనను చూపించిన, చూపిస్తున్న విధానం మనందరికీ తెలిసిందే.చిరంజీవి సినిమా రంగంలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలగడమే కాకుండా.. ఎంతో ఆస్తులను కూడా సంపాదించడం జరిగింది. అయితే ఆయన ఎప్పటికప్పుడు ఆయన అనుభవాలను అందరితో పంచుకుంటారు. అలాగే ఒకసారి చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ తో షూటింగ్స్ పార్ట్ లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు.. సీనియర్ ఎన్టీఆర్ ఇలా అన్నారట..

See also  ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

బ్రదర్ నువ్వు రోజు రోజుకి ఎదుగుతున్నావు, ఇంకా పై స్థాయికి కూడా వెళ్తావు. అయితే వచ్చిన రెమ్యూనరేషన్ డబ్బులతో ఇనప వస్తువులను కాకుండా, భూమిని కొను. అదే మన కుటుంబాన్ని కాపాడుతుంది అని చెప్పారంట. అలాగే చిరంజీవి కార్లు, బైకులు అని డబ్బుని మొదటలో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా భూమి మీదే పెట్టుబడి పెట్టారట. అదే ఈరోజు ఎన్నో కోట్లకు పెరిగి ఈరోజు ఆయన్ని కోటీశ్వరుని చేసింది ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ ఎంతో అభిమానంతో చిరంజీవికి ఇచ్చిన సలహా ఈ రోజు ఆయన్ని అపర కోటీశ్వరుని చేసిందని అందరూ అనుకుంటున్నారు.