
Devara: తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రం (NTR Devara Movie) దేవర. ఇక ఈ చిత్రంలో మనందరికీ తెలిసిన విషయమే బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నది. అయితే ఈ చిత్రంపై ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ హైప్స్ ఇప్పటికే వైరల్ అవ్వగా. . ఈ చిత్రం చూసేందుకు అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన ఒక్కో అప్డేట్ కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకునే అలరించిందని చెప్పాలి.
అయితే ఈ విడుదలైన అప్డేట్ లో భాగంగా ఈ చిత్రంలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరో అని ఆరా తీసే తరుణంలో మృణాల్ థాకూర్ అని కొద్ది మంది. . కృతి శెట్టి అని మరికొద్ది మంది రకరకాల పేర్లు తెరపైకి తీసుకువచ్చారు. అయితే అందులో ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఈ నేపథ్యంలో భాగంగానే తాజాగా ఈ చిత్రంలో రెండు హీరోయిన్ పేరు బయటకు వచ్చింది.
మరి ఆమె ఎవరో కాదు గుజరాతి నటి ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టనేకర్ భార్య శృతి మఠాటి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నదట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కనే ఉన్న ఓ ప్రముఖ పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుందట. . ఇక ఈ సినిమాతో (NTR Devara Movie) శృతి మరాఠీ పేరైతే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో మార్మోగి పోనుందని తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే హాట్ టాపిక్ గా వినపడుతోంది.