Home Cinema NTR 30: ఎన్టీఆర్ 30 సినిమా స్టోరీ ఇదే.. కథలో ట్విస్ట్ అదిరింది..

NTR 30: ఎన్టీఆర్ 30 సినిమా స్టోరీ ఇదే.. కథలో ట్విస్ట్ అదిరింది..

NTR 30: నందమూరి అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి రోజని అనుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ 30 వ సినిమా వస్తాదా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అసలు ఆ సినిమా షూటింగ్ కూడా చాల రోజుల నుంచి అంటున్నారు గాని, స్టార్ట్ అవ్వడం లేదు. అలాంటిది ఈ రోజు సినిమా ( NTR 30 movie story highlights and twists )షూటింగ్ స్టార్ట్ అవ్వడం నిజంగా అభిమానులకు పండగలాగానే ఉంది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్ అని అభిమానులకు తెలుసు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటె, మరోపక్క ఈ సినిమాకి స్పెషల్ ఏమిటంటే.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తొలిసారి పరిచయం అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించిన సినిమాలు చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి.

See also  Upasana Ram Charan: ఉపాసన రామ్ చరణ్ దంపతులకు బిడ్డ పుడితే జరిగేది అదేనా.?? జాతకంలో దోషం నిజమేనా.?

ntr-30-movie-story-highlights-and-twists

 

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించడం తెలుగు సినిమా రంగానికి, సినీ అభిమానులకు అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ మరియు శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోయినా వాళ్ళ వారసులు ఇలా కలిసి నటించడం అంటే నిజంగా చూడటానికి కన్నుల విందుగానే ఉంటాది. ఈ కన్నుల విందు ఎప్పుడు వస్తాదా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆనందంగా ఉంటె.. మరో గొప్ప ఆనందం ఏమిటంటే ఈ సినిమా స్టోరీ గురించి కొరటాల కొంత లీక్ ఇచ్చారు. అనగనగా ఒక సముద్ర తీర ప్రాంత, అదంతా మనం మరిచిపోయిన భూభాగం, ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి..

See also  Mahesh Babu : మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఏకైక సినిమా ఇదే..

ntr-30-movie-story-highlights-and-twists

వాళ్లకు దేవుడు అంటే భయం లేదు… చావు అంటే భయం లేదు.. కానీ ఒక్కటంటే భయం.. ఆ భయం ఎన్టీఆర్… ఇలా ఎన్టీఆర్ పాత్ర ఉద్దేశిస్తూ కొరటాల మాట్లాడారు. కొరటాల ఈ కొంచెం లైన్ చెప్పిన తరవాత సోషల్ మీడియాలో ఈ సినిమా కథ పై అనేక కథనాలు వస్తున్నాయి. అసలు అలాంటి మృగాలు దగ్గరకి ఎన్టీఆర్ ఎందుకు వెళ్తాడు? చావుకు కూడా భయపడని అలాంటి వాళ్లకి చావుకంటే, ఎక్కువ భయాన్ని చూపించి ఎందుకు భయపెడతాడు? దేని కోసం? ఎవరి కోసం అనే ప్రశ్నలకు సమాధానమే జాన్వీ కపూర్ అని అనుకుంటున్నారు. జాన్వీ కపూర్ కొన్ని కారణాల వలన కొందరి స్వార్ధపరులు వలన అలాంటి మృగాల చేతికి చిక్కుతాది. వాళ్ళ నుంచి జాన్వీ ని కాపాడే క్రమంలో.. వాళ్లందరికీ అంతటి భయాన్ని ఎన్టీఆర్ చూపిస్తాడు.

See also  Varun Tej : వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అంట.. నాగబాబు నిహారికల సంచలన నిర్ణయం!

ntr-30-movie-story-highlights-and-twists

జాన్వీ అంటే ఎన్టీఆర్ కి ఎంత ప్రేమ ఉందొ, అలాంటి మనుషులను ఎదుర్కునే దానిలో డైరెక్టర్ ( NTR 30 movie story highlights and twists ) చూపిస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ మరియు విలన్స్ ని చాలా హైప్ లో చూపించి.. వాళ్ళందరిని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే హీరో హైప్ ని ఇంకా బాగా చూపిస్తాడట. అయితే కొరటాల ఇచ్చిన చిన్న లైన్ తో నెటిజనులు ఎన్నో కథలను ఊహించి రాసేస్తున్నారు. ఏది ఏమైనా అసలు సినిమా కథ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే..