Home Cinema Allu Arjun : ప్రభాస్ మహేష్ బాబు కి మాత్రమే కాదు అల్లు అర్జున్ కి...

Allu Arjun : ప్రభాస్ మహేష్ బాబు కి మాత్రమే కాదు అల్లు అర్జున్ కి కూడా..

now-allu-arjun-wax-statue-also-will-come-with-prabhas-and-mahesh-babu-wax-statues-at-madame-tussauds-london-soon

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అవ్వడమే కాకుండా.. ప్రపంచం మొత్తానికి అల్లు అర్జున్ పేరు తెలిసేలా సక్సెస్ ని పొందాడు. తగ్గేదేలే అంటూ ఈ సినిమాతో అల్లు అర్జున్ స్పీడ్ ( Allu Arjun wax statue ) ఇంకా పెరిగింది. పుష్ప సినిమా సక్సెస్ అయ్యి సంచలనాలు సృష్టించడమే కాకుండా.. అల్లు అర్జున్ కి ఎన్నో అవార్డులను కూడా తీసుకొని వచ్చింది. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడిగా ఇప్పటివరకు టాలీవుడ్ నటీనటులు అందుకొని అవార్డుని.. అల్లు అర్జున్ మొదటిసారిగా అందుకున్నాడు. దీంతో మెగా అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు.

Allu-Arjun-wax-london

ఇక అల్లు అర్జున్ కి ఇంత గొప్ప అవార్డు వచ్చినందుకు మెగా కుటుంబం కూడా ఎంతో ఆనంద పడిపోతుంది. జాతీయ అంతర్జాతీయ లెవెల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పెంచుకుంటూ వెళ్తున్న అల్లు అర్జున్కి ( Allu Arjun wax statue ) ఇప్పుడు మరొక గౌరవం దక్కనుంది. అలాంటి గౌరవం ఇప్పటికీ మన టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు లకు దక్కింది. ప్రభాస్, మహేష్ బాబులకు దక్కిన ఆ గౌరవం ఇప్పుడు అల్లు అర్జున్ కి కూడా దక్కబోతుందని అంటున్నారు. నిజంగానే అది జరిగితే మెగా కుటుంబం నుంచి కూడా ఒకరికి ఆ గౌరవం దక్కినట్టు ఆనందంతో పొంగిపోవచ్చు మెగా అభిమానులు మరియు మెగా కుటుంబం.

See also  Nani: పాపం నానిని సాంతం నాకించే ఐడియా ఎవరిచ్చారో తెలుసా?

Prabhas-wax-statue-london

లండన్ లోని మేడం టుసాస్డ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ మైనపు విగ్రహాన్ని గాని ఏర్పాటు చేస్తే నిజంగా అది మామూలు విషయం కాదు. దాన్ని ప్రతి ఒక్కరూ చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతారు. ఇప్పటికే అక్కడ బాలీవుడ్ హీరోలవి ఎక్కువగానే ఉన్నాయి కానీ.. టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరివే ఉన్నాయి. అయితే వీళ్ళతోపాటు ( Allu Arjun wax statue ) ఇప్పుడు అల్లు అర్జున్ది కూడా రాబోతుందని అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కొలతలు ఇవ్వడానికి అల్లు అర్జున్ లండన్ కి కూడా వెళ్లబోతున్నాడు అని అంటున్నారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమందో అఫీషియల్ గా అయితే రాలేదు కానీ.. ఈ వార్త నిజమే అయితే మాత్రం నిజంగా అల్లు అర్జున్ దానికి అర్హుడనే అందరూ అనుకుంటున్నారు.

See also  Pawan kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్..

mahesh-babu-wax-statue-london

సౌత్ హీరోల్లో ఈ గౌరవాన్ని పొందే మూడో హీరోగా అల్లు అర్జున్ పేరు నిలబడిపోతుంది. అందుకే ఈ వార్త నిజం అవ్వాలని అల్లు అర్జున్ అభిమానులు ఆ భగవంతుని వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా రూపొందుతున్న పుష్ప2 సినిమా శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుందని.. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్థాయి ఎక్కడకు వెళ్తుందో.. అసలు ఆ సినిమా కథని గాని, ఒక్కొక్క సీన్ ను గాని అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉందని ఎప్పటికప్పుడు అప్డేట్లను చూసి అభిమానులు అనుకుంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అది ఏ స్థాయికి వెళ్తుందో..