Home Cinema Spy movie business: నిఖిల్ స్పై ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. సినిమాలో బాలకృష్ణ!

Spy movie business: నిఖిల్ స్పై ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. సినిమాలో బాలకృష్ణ!

nikhil-siddhartha-spy-movie-business

Spy movie business: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒక్కడైనా నిఖిల్ కు రోజురోజుకి మంచి డిమాండ్ పెరుగుతుంది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయిన నిఖిల్ ఇప్పుడు ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా ( Nikhil Spy movie business ) తర్వాత 18 పేజెస్ సినిమా ఒక వినూత్నమైన కథతో ఎంతో మంచి నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ కి మంచి పేరు కూడా వచ్చింది. ఇలా ఒక సినిమా తర్వాత ఒక సినిమాతో నిఖిల్ కి రోజురోజుకీ క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇక పెద్ద పెద్ద హీరోలు కళ్ళు కూడా నిఖిల్ మీద పడుతున్నాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

nikhil-siddhartha-spy-movie-business

ఎందుకంటే రామ్ చరణ్ స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థలో మొట్టమొదటిసారిగా నిఖిల్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించిన అనేక డీటెయిల్స్ ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నిఖిల్ ( Nikhil Spy movie business ) హాలీవుడ్ వరకు కూడా వెళ్లడానికి అవకాశం ఉందని.. అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ సినిమా స్పై జూన్ 29వ తేదీన అందరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. సుభాష్ చంద్రబోస్ మిస్ అయిన మిస్టరీని ఈ సినిమాలో చూపిస్తారని అందరూ ఆత్రుతగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరం అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగిందంట.

See also  Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

nikhil-siddhartha-spy-movie-business

నిఖిల్ హీరోగా నటించిన స్పై సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 13 నుంచి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట. అలాగే మిగిలిన దేశాల్లో అన్నిటికీ ఎగ్జాక్ట్గా ఎంతవుతుందో ఎంత అయిందో తెలియడం లేదు కానీ.. మొత్తం మీద ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవ్వాలంటే 17 కోట్లు దాటితే అయినట్లే మిగలాలని.. ఇతర భాషల్లో బిజినెస్ ( Nikhil Spy movie business ) లెక్కలు అయితే ఇంకా తెలియలేదు కానీ.. సినిమా గాని సక్సెస్ అయితే 17 కోట్లురాబట్టడం అనేది చాలా ఈజీ అవ్వడమే కాకుండా విపరీతమైన లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఎస్టిమేషన్స్ వేసే వాళ్ళు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమాపై మరొక వార్త కూడా హల్చల్ చేస్తుంది. దానితో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని అందరూ అనుకుంటున్నారు.

See also  Kalyan Ram: కళ్యాణ్ రామ్ తో పోటికి దిగనున్న మెగాస్టార్..!! రగిలిపోతున్న నందమూరి అభిమానులు.

nikhil-siddhartha-spy-movie-business

ఇంతకీ అదేమిటంటే.. స్పై సినిమాలో నిఖిల్ బాలకృష్ణ అభిమాని అంట. ఈ సినిమాలో నిఖిల్ బాలకృష్ణ గురించి జై బాలయ్య అంటూ ఉంటాడంట. దీనివలన సినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇంతకుముందు నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాలో కూడా బాలకృష్ణ అభిమానిగా చేయడం వలన ఆ సినిమా సూపర్ హిట్ అయింది అంట. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాలో కూడా బాలయ్య పేరు పలుకుతాడని.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇంకొక రెండు రోజులు ఆగితే 29వ తేదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అన్ని క్లియర్గా అర్థం అవుతాయి. ఏదేమైనా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మరి అవన్నీ వసూళ్లు ఎంతవరకు రాబడుతుందో 29వ తారీఖున తెలుస్తాది.