Spy Trailer Review : నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై సినిమాపై చాలామందికి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మీద సినిమా తీస్తున్నారని అర్థమైంది. అలాగే ఈరోజు స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ( Nikhil Spy trailer Review )చూసిన తర్వాత ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే నిఖిల్ అంటే స్పెషల్ అని పేరు ఉంది. నిఖిల్ ఏ సినిమా ఎన్నుకున్నా కూడా ఆ సినిమా కథ తీసే విధానం కూడా ఆడియన్స్ కి స్పెషల్ గానే అనిపిస్తుంది. అందుకే నిఖిల్ చిన్న హీరో అయినప్పటికీ చాలా పెద్ద హిట్స్ తన సొంతం చేసుకున్నాడు.
ఇక నిఖిల్ ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటినుంచి నిఖిల్ పై అందరి కళ్ళు ఒక్కసారిగా తిరిగాయి. ఇప్పుడు రిలీజ్ అయిన స్పై ట్రైలర్ చూసిన తర్వాత వామ్మో నిఖిల్ ఇంత ఇరగదీస్తాడా అన్నట్టు ఉంది. ట్రైలర్ మొదలు షూటింగ్స్, ఫైటింగ్స్ తో చూపించాడు. అది చూసి సినిమాలో హాలీవుడ్ ( Nikhil Spy trailer Review ) మూవీ లెవెల్ లో ఫైట్స్ ఉంటాయని అర్థమైంది. ఆ తర్వాత లవ్ యాంగిల్ ఎలా ఉంటుందో సినిమాలో ట్రైలర్ లో చూపించాడు. నిఖిల్ ఐశ్వర్య మినన్ జోడి చక్కగా కుదిరింది. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ సినిమాలో బానే ఉంటుంది అనిపించింది. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా హీరోకి చిన్న ఫ్యామిలీ ఉన్నట్టు.. అందులో కొన్ని సెంటిమెంట్స్ కూడా చూపిస్తారని అర్థమవుతుంది.
ఇక యూత్ కి నచ్చేలా ఈ సినిమాలో రొమాన్స్ కూడా బాగానే పెట్టాడు అన్నట్టు చూపించాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు కనుక ఇది ఇతర దేశాల్లో కూడా ఆడే అవకాశం ఉంది గనుక.. ఆ పరంగానే సినిమాలో అన్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. హీరో ఫ్యాషన్ ( Nikhil Spy trailer Review ) చూస్తే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని అర్థమైంది. పాలిటిక్స్ మీద బుక్స్ చదివి.. ముందు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి అర్థం చేసుకుని మన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కనిపించకపోవడానికి కారణాన్ని వెతకడానికి వెళ్తాడని అనిపిస్తుంది.
ఇక సినిమాలో ఫస్ట్ అఫ్ అంత లవ్, ఫ్యామిలీ స్టోరీ, కామెడీ,రొమాన్స్, హీరో ఫ్యాషన్ చూపిస్తారని అర్థమవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సినిమా అసలు టర్న్ తీసుకుంటుందని అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ మొత్తం హాలీవుడ్ సినిమానే మన ముందుకు తీసుకొస్తారని అర్థమవుతుంది. హాలీవుడ్ లెవెల్లో సినిమాలో ఫైట్స్.. అలాగే విలన్స్ కూడా హాలీవుడ్ లెవెల్లో కనబడతారని సెకండ్ హాఫ్ మొత్తం రేస్ చూపిస్తాడని.. చాలా ఉత్కంఠంగా ఉంటుందని.. ఇక ఈ తరం పిల్లలయితే ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. మరి ట్రైలర్ చూస్తే ఇలా ఉంది.. సినిమా ఈ అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూడాలి..