Niharika : పూర్వం పెళ్లిళ్లు అంటే నూరేళ్ల పంట అని అనుకునేవారు. ఒక్కసారి తాళి కట్టించుకుంటే.. కట్టినవాడు, కట్టించుకున్న ఆమె కూడా దానికి ఎంతో విలువ, గౌరవం ఇచ్చి ఒకరితో ఒకరు అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని ముందుకు సాగించేవారు. మరి ఇప్పుడు పెళ్లిళ్లు ఎంత ఘనంగా చేసుకుంటున్నారో.. అంత ఈజీగా ఒకరిని ఒకరు ( Niharika alimony from Chaitanya In court ) వదిలేసుకుంటున్నారు. కారణాలు ఏమిటో తెలియడం లేదు గాని.. విడిపోవడాలు చాలా ఎక్కువే అవుతున్నాయి. దీనికి ఆడవారు కారణమా? మగవారు కారణమా అనే చర్చ పక్కన పెడితే మాత్రం.. ఎందుకు ఏమైనా కూడా మన వివాహ వ్యవస్థ ఏమవుతుందో అనే భయం మాత్రం మొదలవుతుంది.
ఒక పెళ్లి జరిగితే.. ఆ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలుచుకుని.. వాళ్ల దగ్గర పరువు పోకూడదని అనుకుంటూనే జీవితమంతా ఒకరికి ఒకరు అడ్జస్ట్ అవుతూ బతికేసేవారు. ఇప్పుడు అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ల గురించి అందరికీ తెలుస్తుంది అని తెలిసి కూడా వాళ్ళ నిర్ణయాలు మాత్రం ఎక్కడా అదుపులో పెట్టుకోలేని ( Niharika alimony from Chaitanya In court ) పరిస్థితి కనిపిస్తుంది. మెగా కుటుంబంలో మెగా డాటర్ నిహారిక గురించి ఎన్నో రోజులుగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి. ఆమె తన భర్తని వదిలేస్తుందని విడాకులు తీసుకోబోతుందని వచ్చిన వార్తలు కేవలం యాంటీ ఫాన్స్ గాని.. ఇంకెవరైనా గానీ సృష్టిస్తున్న రూమర్స్ మాత్రమే అని చాలా రోజులు అందరూ అనుకున్నారు.
కొంతకాలానికి అది నమ్మాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే నిహారిక వంటరిగా కనిపించడంతో.. భర్తతో ఆమె విడిపోవడానికి సిద్ధంగా ఉందన్న విషయం అర్థమైంది. కాబట్టి ఈరోజు ఆమె విడాకులు తీసేసుకున్నానని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు కూడా అంతగా ఆశ్చర్యపోలేదు. లేదంటే ఇది కూడా అందరికీ ( Niharika alimony from Chaitanya In court ) షాకింగ్ న్యూస్ లాగే ఉండను. మెగా కుటుంబంలో మెగా డాటర్ లు అందరూ ఎందుకు ఇలా విడిపోతున్నారు అర్థం కావడం లేదు. కానీ కారణమేదైనా కూడా బాధపడాల్సిన విషయం గానే కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటే ఇప్పుడు నిహారిక విడాకులు తీసుకుంది అన్న తర్వాత.. ఆమె భరణం గురించి డిస్కస్ చేసుకోవడం మొదలెట్టారు నెటిజనులు..
నిహారిక ఆమె భర్త చైతన్య విడాకులు తీసుకోవడంలో మొదట చైతన్యనే విడాకులకు అప్లై చేశాడని అంటున్నారు. అంటే మొదట చైతన్య నే అప్లై చేశాడంటే.. కచ్చితంగా నిహారికకి భరణమైతే ఇవ్వాలి కదా.. అయితే భరణం కొన్ని కోట్లలో ఇచ్చి ఉంటాడని అనేక వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మరికొన్ని వార్తలు ప్రకారం.. నిహారికకి భరణం గురించి కోర్టు ఆలోచిస్తుండగా.. నిహారిక కచ్చితంగా తెగేసి చెప్పేసింది అంట.. నాకు ఒక్క రూపాయి కూడా అతని దగ్గర నుంచి భరణం అవసరం లేదని.. నా కాళ్ళ మీద నిలబడగలను సంపాదించుకోగలనని చెప్పిందంట. నిజంగా వచ్చే డబ్బుని, ఆస్తిని వద్దని అంత ధైర్యంగా నాకు నేను బ్రతుకుతానని నిహారిక చెప్పడం.. కోర్టులో అలా ఖచ్చితంగా చెప్పి ఉంటే ఈ వార్త నిజమే అయితే అది గొప్పతనమే అని మరోపక్క కొందరు పొగుడుతున్నారు. ఏదేమైనా నిహారిక ఫ్యూచర్ లైఫ్ అయినా బాగుండాలని అందరూ ఆశిస్తున్నారు.