Niharika : మెగా డాటర్ నిహారిక పై ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. నిహారిక ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అయ్యి.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ( Nagababu was angry with Niharika ) సక్సెస్ చూడక.. ఆమె సినిమా రంగానికి దూరమై పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె కొన్ని సమస్యల వలన విడాకులు తీసుకుంది. ఎప్పుడైతే నిహారిక విడాకులు తీసుకుందో అప్పటినుంచి ఆమెపై అనేక నెగిటివ్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా నిహారిక తనను ఎందరో ఎన్నో ఊరికినే అనుకున్నా పట్టించుకోకుండా తన కెరీర్, తన లైఫ్ గురించి చూసుకుంటూ ఉంది.
నిహారిక ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. తన గురించి కొన్ని పర్సనల్ విషయాలని చెప్పుకుంటూ వచ్చింది. నిహారిక అర్థరాత్రి ఇంట్లో కనిపించకపోయేసరికి ఎవరితో వెళ్ళిందో తెలిసి నాగబాబుకి చాలా కోపం వచ్చిందంట. నాగబాబు ( Nagababu was angry with Niharika ) జీవితంలో నిహారికను కొట్టడం అంటే ఒక్కసారే కొట్టాడంట. ఇంతకీ అసలు నిహారిక అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది ?ఎప్పుడు వెళ్ళింది? నాగబాబుకి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నిహారిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదు.. ఒకే ఒక్కసారి కొట్టారు. అది కూడా నేను స్కూల్ డేస్ లో చదువుకునేటప్పుడు అని చెప్పుకుంటూ వచ్చింది.
నేను స్కూల్ డేస్ లో చదువుకున్నప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ బర్త్డే వచ్చింది. బర్త్డే పార్టీ కి వెళ్తాను అని ముందుగానే కొన్ని రోజులు ముందు ఇంట్లో చెప్పాను. అయితే ఆరోజు వెళ్లేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక.. నేను డ్రైవర్ అంకుల్ తో కలిసి వెళ్ళిపోయాను. తర్వాత వీళ్లంతా ఇంట్లో చూసుకుంటే నేను లేను. లేకపోవడంతో ( Nagababu was angry with Niharika ) అందరూ కంగారు పడ్డారు. అప్పట్లో ఫోన్లు సౌకర్యం లేకపోవడం వలన.. నాన్న మా ఫ్రెండ్ ఎదురుగానే ఒక బుక్ స్టాల్ ఉండేది. అప్పుడప్పుడు నేను ఆ బుక్ స్టాల్కి ఫోన్ చేసి కొత్త బుక్స్ వచ్చాయా అని అదిగేదాన్ని.. అది గుర్తుకొచ్చి ఆ బుక్ స్టాల్ అతనికి ఫోన్ చేశారు. మా అమ్మాయి ఏమైనా అటువైపు వచ్చిందా అని అడిగితే ఇప్పుడే బర్త్డే పార్టీలో చూశాను అని చెప్పాడు.
దానితో మా నాన్న కొంచెం ఊపిరి పీల్చుకొని.. మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి అందరి ఎదురుగా నన్ను జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసుకొచ్చి కార్ ఎక్కిన తర్వాత.. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఆడపిల్లవి కనిపించకపోతే ఇంట్లో అందరూ ఎంత కంగారు పడతాము.. చెప్పి వెళ్ళక్కర్లేదా అని నా వీపు మీద ఒక గుద్దు గుద్దారు. అంతే మా నాన్న నన్ను కొట్టినందుకు మూడు రోజులు నేను మాట్లాడలేదు. ఆ తర్వాత నిజమే కదా నాన్న నా గురించే కదా చెప్పారు అనుకున్నాను. అయితే నేను మూడు రోజులు మాట్లాడకపోతే.. మా నాన్న మాత్రం ఆడపిల్లను అనవసరంగా కొట్టానని పది రోజులు చాలా ఫీలయ్యారంట. అంతే అప్పటినుంచి ఇంకెప్పుడు నన్ను కొట్టలేదు అని నిహారిక తన చిన్నప్పటి సంగతుల్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనితో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.