Home Cinema Niharika konidela: వరద బాధితులకు భారీ విరాళం అందించి ట్రోల్ కి గురవుతున్న నిహారిక..

Niharika konidela: వరద బాధితులకు భారీ విరాళం అందించి ట్రోల్ కి గురవుతున్న నిహారిక..

niharika-konidela-getting-trolled-heavily-for-her-donation-to-floods

Niharika Konidela: ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలను గత కొంతకాలంగా వరదలు ఎలా పట్టి పీడిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయవాడ నగరం ఇంకా పూర్తి స్థాయిలో నీటి నుండి బయటపడలేదు, అక్కడి జనాలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొంతమంది వరద నీటిలో కొట్టుకొని పోతే , మరికొంత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. విజయవాడ పరిసరాల్లో ఉండే 400 గ్రామాలు నీటిలో కలిసిపోయాయి(Niharika Konidela Floods Donation). సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ సాధ్యమైనంత తొందరగా ఈ విపత్తు నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.

See also  Mega Hero: నిహరికను నువ్వు భరించగలవా.? ముందే చెప్తున్నా అంటూ నిశ్చితార్థం కాకముందే చెప్పాడట ఆ మెగా హీరో..

ఇదంతా పక్కన పెడితే సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరోలందరూ తమవంతు సహాయం గా డబ్బులు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఉపముఖ్యమంత్రి హోదా లో ఉన్నప్పటికీ కూడా తన సొంత కష్టార్జీతం తో సంపాదించిన 6 కోట్ల రూపాయిలను విరాళం గా ప్రకటించాడు. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి ఇచ్చిన విరాళాలను కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విజయవాడ కలక్టరేట్ వద్ద కలిసి కోటి రూపాయిల చెక్ ని అందచేసాడు.

See also  Colors Swathi: త్వరలో కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందా.? ఇందులో ఉన్న నిజమెంత.

రేపు ఆయన 400 పంచాయితీలకు కలిపి 4 కోట్ల రూపాయిలు విరాళం అందించనున్నాడు(Niharika Konidela Floods Donation). అలాగే అతిత్వరలోనే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కోటి రూపాయిలు విరాళం అందించనున్నాడు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా విరాళం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘విజయవాడలోని రూరల్ ప్రాంతంలో వరద కారణంగా గ్రామాలూ నీట మునగడం, జనాలు అష్టకష్టాలు పడుతుండడం నాకు చాలా బాధని కలిగించింది. నేను పెరిగింది పట్టణం లో అయినా, నా కుటుంబ సభ్యులు గ్రామాల నుండి వచ్చిన వారే.

See also  Neha Shetty: ఐదు నిమిషాలే గా ఓర్చుకో పనైపోతది అంటూ నేహ శెట్టిని టార్చర్ చేసిన నిర్మాత.

అందుకే నేను కూడా గ్రామాల మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను. ఉప ముఖ్యమంత్రి అయిన మా బాబాయ్ తో పాటుగా మా కుటుంబ సభ్యులందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. నేను కూడా 10 గ్రామాలకు 50 వేల రూపాయిల చొప్పున 5 లక్షల రూపాయిలు విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై కొంతమంది నెటిజెన్స్ ప్రశంసించగా, మరికొంత మంది మాత్రం నువ్వు ప్రస్తుతం నివస్తున్న తెలంగాణ ప్రాంతం కూడా వరదలో మునిగిపోయింది, మరి తెలంగాణ ప్రజల కోసం ఏమి ఇవ్వవా అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు..