Niharika : మెగా డాటర్ నిహారికకి ఉన్న ఫేమ్ స్పెషల్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈమె నటించిన సినిమాలు పెద్దగా లేనప్పటికీ.. పైగా నటించిన కొన్ని సినిమాలలో కూడా చెప్పుకోతగ్గ హిట్స్ లేనప్పటికీ.. నిహారిక కి అభిమానులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. అలాగే సినిమాలకు దూరం అయినా కూడా ఇప్పటికీ ( Niharika comments about divorce ) ఆమెను సోషల్ మీడియాలో సినీ అభిమానులు బాగా ఫాలో అవుతున్నారు. గత కొన్ని నెలలుగా నిహారిక సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ వస్తుంది. నిహారిక తన భర్తతో విడిపోతుందని, విడాకులు తీసుకుంటుందని అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి కారణం ఏమిటంటే నిహారిక సోషల్ మీడియాలో తన భర్త జొన్నలగడ్డ చైతన్య ని అన్ ఫాలో చేయడం..
అలాగే అతను కూడా అన్ ఫాలో చేయడం ఇద్దరు వాళ్ళ పెళ్లి ఫోటోలు, వాళ్ల కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం.. ఇలాంటివి జరగడం వలన కచ్చితంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు విడిపోతున్నారు అని వార్తలు గట్టిగా వచ్చాయి. దీనికి తోడు యాంటీ మెగా అభిమానులు నిహారికని సోషల్ మీడియాలో ( Niharika comments about divorce ) ఎక్కువగా చేస్తున్నారు. నిహారిక పెళ్లి ఎంతో వైభవంగా చేసింది మెగా ఫ్యామిలీ. ఈ పెళ్లి జరిగేటప్పుడు చైతన్య పెట్టిన ఒకే ఒక కండిషన్.. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలో నటించకూడదు అని వార్తలు వచ్చాయి. దానికి అప్పట్లో నిహారిక ఒప్పుకుందని ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని.. దానివల్లనే వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుందని అనేక వార్తలు ప్రచారాల్లోకి వస్తున్నాయి.
కానీ నిజానికి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే దానిమీద ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ గాని, నిహారిక గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత కొన్ని నెలలుగా ఇంత గట్టిగా ఈ విషయంపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ మౌనంగా ఉండటం కూడా అర్ధాంగికారమే అన్నట్టుగా నెటిజనులు భావిస్తున్నారు. సినిమాలలో ( Niharika comments about divorce ) ఎంతో ఆశతో హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారికకి సరైన ప్రతిఫలం దక్కలేదు. అయితే సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉన్న నిహారిక సినిమాల్లో ఫెయిల్ అయిన కూడా ఆ రంగాన్ని వదిలిపెట్టకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తుంది. తాజాగా నిహారిక నటిస్తున్న డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ మే 19న విడుదల కాబోతుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ గురించి నిహారిక కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొంది. ఇంటర్వ్యూలో ఆమె పర్సనల్ లైఫ్ విడాకుల గురించి ప్రశ్నించడం జరిగింది. ఎప్పటినుంచో ఇలాంటి ఇంటర్వ్యూలో కచ్చితంగా ఇలాంటి ప్రశ్న నిహారిక ఎదుర్కోక తప్పదని.. దానికి సమాధానం ఖచ్చితంగా ఇస్తాదని అందరూ భావించారు. కానీ అందరి ఆలోచనలకి భిన్నంగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిహారిక తన విడాకుల గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్నల్ని స్కిప్ చేసింది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె విడాకుల పైన ఇన్ని వార్తలు వస్తున్నా కూడా.. డైరెక్ట్ గా అడిగినప్పుడైనా అందులో అసలు ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఏం చేయబోతుంది అనేది కనీసం చిన్న సమాధానం కూడా చెప్పకపోవడం ఎంత దారుణం అంటూ నెటిజన్లు వాపోతున్నారు.