Home Cinema Niharika : అన్న ఎంగేజ్మెంట్ లో పెద్ద సీక్రెట్ బట్టబయలు చేసిన నిహారిక.. ఇక లావణ్య!

Niharika : అన్న ఎంగేజ్మెంట్ లో పెద్ద సీక్రెట్ బట్టబయలు చేసిన నిహారిక.. ఇక లావణ్య!

niharika-attend-varun-tej-and-lavanya-tripathi-engagement-function-in-hyderabad

Niharika : ఎట్టకేలకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ నిన్న ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ( Niharika attend Varun and Lavanya )ఎంగేజ్మెంట్ నిజంగా జరుగుతుందా లేదా అనే అనుమానం నుంచి.. ఈరోజుకి ఆ వేడుకకు వచ్చిన సెలబ్రిటీస్ అందరి ఫోటోలు చూసే హడావిడిలో ఆనందంలో తేలిపోతున్నారు నెటిజనులు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన, అలాగే అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి మొదలగువారు వచ్చారు.

niharika-attend-varun-tej-and-lavanya-tripathi-engagement-function-in-hyderabad

అలాగే ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఆయన వచ్చిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఈ వేడుకలో ముఖ్యమైన పాత్ర ఉన్న నిహారిక కూడా వచ్చింది. ఎందుకంటే.. అన్న గారిది ఏదైనా సంబరం అంటే అక్కడ ఆడపడుచుదే మొత్తం అధికారం, ఆడంబరం ( Niharika attend Varun and Lavanya ) అన్ని ఉంటాయని మనకు తెలుసు. అలా చక్కగా అన్న ఎంగేజ్మెంట్ కి నిహారిక చక్కటి తెలుగింటి అమ్మాయిల అందంగా మంచి చీర కట్టుకొని ఫంక్షన్ కి అటెండ్ అయ్యింది. ఇక ఈ పెళ్లి వేడుక ఇక్కడ నుంచి మొదలైనట్టే.. నిహారిక ఫోటోల్లో అన్న వదినతో కలిసి ఎంతో ఆనందంగా నవ్వుతూ.. ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటో చూసి మెగా అభిమానులు పొంగిపోతున్నారు.

See also  Venu Swamy: ఆ యాంకర్ గురించి వేణు స్వామి చెప్పిన విషయమే నిజం అవ్వబోతుండా.?

niharika-attend-varun-tej-and-lavanya-tripathi-engagement-function-in-hyderabad

ఇక వరుణ్ తేజ్ నిహారికను చూస్తూ నవ్వే విధానం.. ఆమెను పట్టుకునే విధానం చూస్తే.. చెల్లెలు అంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది. అలాగే లావణ్య త్రిపాఠి కూడా నిహారికని ఆప్యాయంగా పట్టుకునే విధానం చూస్తే.. ఆడపడుచు అంటే ఎంత ఇష్టం, గౌరవం ఉందో తెలుస్తుంది. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ మంచి ( Niharika attend Varun and Lavanya ) ఫ్రెండ్స్ అని అంటూ వస్తున్నారు. నిహారిక, లావణ్య మంచి ఫ్రెండ్స్ అని చాలా చదువుగా ఉంటారని తెలుస్తుంది. అయినా కూడా అభిమానం, గౌరవం మాత్రం ఎక్కడా తగ్గనివ్వకుండా.. నిహారికని వాళ్ళిద్దరూ చాలా బాగా చూసుకుంటున్నట్టు ఆ ఫోటోలో కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది.

See also  Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

niharika-attend-varun-tej-and-lavanya-tripathi-engagement-function-in-hyderabad

గత కొంతకాలంగా నిహారిక ఆమె భర్తతో విడిపోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని గురించి ఎవరూ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకుని.. ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. దీనితో వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం గ్యారెంటీ.. నిహారిక కూడా భర్తతో విడిపోతుంది. మెగా కుటుంబంలో ఆడపిల్లల జీవితాలు ఎందుకు ఇలా అవుతున్నాయి అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కొందరు దీనిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఈరోజు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలో ఎంగేజ్మెంట్ కి.. సొంత భార్యకి సొంత అన్న అంటే బావమరిది ఫంక్షన్ కి ఎందుకు నిహారిక భర్త రాలేదని.. నిహారిక ఒక్కర్తి వచ్చి ఎందుకు ఎంజాయ్ చేసిందని అంటే.. అతను కావాలనే కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని.. దీన్నిబట్టి నిహారిక తన జీవితంలో ఉన్న పెద్ద సీక్రెట్ ని ఓపెన్ చేసేసింది అని.. అందుకే సింగల్ గా వచ్చిందని అనుకుంటున్నారు. ఇక లావణ్య అయితే ఆడపడుచుని నీకు ఎవరున్నా లేకపోయినా మేమున్నాం అన్నట్టుగా పట్టుకొని.. చాలా ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటున్నట్టు ఫోటోలో కనిపిస్తుంది.