Home Cinema Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. అవకాశాలు అందుకోవడం కోసమేనా.??

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. అవకాశాలు అందుకోవడం కోసమేనా.??

Nidhhi Agerwal: అవును.. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీ లో వేణు స్వామి ఏది చెప్తే అదే జరుగుతుందని భావిస్తున్నారని జనాలు కామెంట్లు చేస్తున్నారు. అలా ఎందుకు జరిగిందంటే ఈ మధ్య కొందరు హీరోయిన్స్ ప్రముఖ జ్యోతిష్యుడుగా పేరు పొందిన అటువంటి వేణు స్వామి చెప్పే మాటలు నమ్మి ఆయనతో ప్రత్యేకమైన పూజలు చేయించుకున్నారు. అదే తరహాలోకి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన (Nidhhi Agerwal) నిధి అగర్వాల్, వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్న వార్తలు సోషల్ మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.

See also  Ustaad Bhagat Singh: కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక లేనట్లేనా.?

nidhhi-agerwal-offers-prayers-with-venu-swamy-to-get-famous

దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవ్వడంతో.. హీరోయిన్లందరూ వేణు స్వామిని గుడ్డిగా నమ్మి ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే మనందరికీ తెలిసిన విషయమే గతంలో రష్మిక మందన్న కెరియర్ కూడా పీక్స్ లో ఉన్నప్పుడు.. ఆమె వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకుని ప్రస్తుతం ఏ రేంజ్ కి ఎదిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇదే కాక తను ఈ రేంజ్ కి ఎదగడానికి కారణం వేణు స్వామితో చేయించిన పూజలు అని చాలామంది చెబుతున్నారు. అయితే ఇదే కోవలోకి ప్రస్తుతం నిధి అగర్వాల్ కూడా బాట పట్టింది.

See also  Lavanya Tripathi : పెళ్లి తరవాత ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. లేకపోతే నిహారిక..

అందుకే రష్మిక లాగే తన కెరీర్ కూడా చిత్ర పరిశ్రమలో చాలా బిజీ అవ్వాలని అనుకున్నది ఏమో కానీ అచ్చం రష్మిక చేయించుకున్న పూజలు వేణు స్వామితో ప్రత్యేకంగా చేయించుకుంది. మనందరికీ తెలుసు వేణు స్వామి ప్రత్యేకించి సెలబ్రిటీల గురించి చెప్పిన ప్రతి విషయాలు నిజం అవడంతో ఈయన చెప్పిన మాటలు నిజమే అవుతాయని చాలామంది భావిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్, రష్మిక మందనే కాకుండా ఇటీవల కాలంలో కృతి శెట్టి కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుందని వార్తలు వస్తున్నాయి.

nidhhi-agerwal-offers-prayers-with-venu-swamy-to-get-famous

నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు చిత్రాల్లో నటించినప్పటికీ ఎందుకో తెలియదు ఈ అమ్మడికి అంతగా గుర్తింపు పొందడం లేదు. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని వేణు స్వామి తో ప్రత్యేకమైన పూజలు చేయించుకుంది. ఈ విషయాన్ని తెలిసి చాలామంది జనాలు వేణు స్వామి పూజలకు నిజంగా అంత పవర్ ఉందా.? మరి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కూడా మరొక కృతి శెట్టి, రష్మిక మందన లాగా హిట్ జాబితాలోకి వెళ్లిపోతుందా అంటూ ప్రశ్నార్థకాలు పెడుతున్నారు.! చూద్దాం.. మరి ఇప్పుడు నిధి అగర్వాల్ కెరియర్ ఈ పూజల తర్వాత ఎలా ఉంటుందో..