Home Cinema OTT : ఈ వీకెండ్ ఓటీటీ లో విడుదల అవ్వబోతున్న బ్లాక్ బస్టర్ కొత్త సినిమాలు...

OTT : ఈ వీకెండ్ ఓటీటీ లో విడుదల అవ్వబోతున్న బ్లాక్ బస్టర్ కొత్త సినిమాలు ఇవే..

OTT : వారం మొత్తం పని చేసి వీకెండ్ లో కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఉద్యోగస్తులు సినిమాలు చూస్తుంటారు. ఒకప్పుడు అంటే కొత్త సినిమాలు చూసేందుకు కచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత బోలెడన్ని సినిమాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఓటీటీ యాప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి(ott movies this week). అంతే కాకుండా ఈమధ్య ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా కేవలం రెండు మూడు వారాలకే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అందుకే ఆడియన్స్ థియేటర్స్ లో చూసే బదులు ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

See also  Animal: అర్జున్ రెడ్డి యానిమల్ కి ఉన్న పోలిక అదే.. యానిమల్ పేరుకి కారణం కూడా అదే..

mumbai-meri-jaan

రీసెంట్ గానే సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి కూడా నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ వీకెండ్ లో మన ముందుకు రాబొయ్యే ఓటీటీ సినిమాలపై ఒక లుక్ వేద్దాం. రీసెంట్ గానే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన ఫ్రీ స్టైల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

See also  Mangalavaaram : అందుకే మంగళవారం వస్తుందంటే భయమేస్తుంది..

jailer-on-amazon-prime

ఈ నెల 13 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. అలాగే ‘బాంబై మేరే జాన్’ అనే సినిమా 14 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో ‘ఒన్స్ అపాన్ ఏ క్రైమ్’ అనే ఇంగ్లీష్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతుంది. వీటితో పాటు తెలుగు హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామ బాణం’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధం గా ఉంది(ott movies this week). ఇక ఈ నెలాఖరున ఎలాగో విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం కూడా ఓటీటీ లో విడుదల అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే అక్కినేని అఖిల్ ఏజెంట్ చిత్రం మాత్రం ఇప్పటి వరకు ఓటీటీ లో విడుదల అవ్వలేదు.

See also  Trisha : త్రిష అందం కోసం అలాంటి పని చేస్తుందని వాళ్ళ ద్వారా సీక్రెట్ అవుట్!

kushi

ఓటీటీ వోచిన మొదట్లో సినిమా వాలు దాన్ని చాల వ్యతిరేకించారు. అందరూ ఓటీటీ లో సినిమాలు చూస్తే ఇంక థియేటర్ లకు ఎవరు వస్తారు అని ధర్నాలు కూడా చేసారు. మెల్లిగా అంత సైలెంట్ ఐపోయారు. దీనికి కారణం సినిమా వాళ్లకు ఓటీటీ కంపెనీ వాలు ఇచ్చే డబ్బు, సినిమా రిలీజ్ కి ముందే వాళ్ళ సినిమా కి అయిన ఖర్చు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుకుంటున్నారు. మెల్లిగా ఇంక సినిమా వాళ్ళు కూడా సైలెంట్ ఐపోయారు మా డబ్బు మాకు వస్తుంది కదా ఇక మనకెందుకు అని. ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది థియేటర్ వాళ్ళే.