Home Cinema Kajal Aggarwal : వేణు స్వామి కి పోటీగా కాజల్ అగర్వాల్!

Kajal Aggarwal : వేణు స్వామి కి పోటీగా కాజల్ అగర్వాల్!

netizens-compare-kajal-aggarwal-with-astrologist-venu-swamy

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిందే. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అక్కడి నుంచి తన అందచందాలతో, మంచి ( Netizens compare Kajal Aggarwal ) నటనతో అందరిలోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కాజల్ అగర్వాల్ కి మంచి అభిమానులు చేకూరేలా.. తన కష్టపడి సినిమాల్లో బాగా నటించుకుంది. ఇంచుమించుగా టాలీవుడ్ , కోలీవుడ్ మంచి స్టార్ హీరోలు సరసన సినిమాలు నటించింది. సినిమాల్లో మంచి ఫేమ్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని సినిమాలకు కొంచెం దూరం అయింది. కాజల్ అగర్వాల్ ముంబైలో ఒక వ్యాపారవేత్తని గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని..

netizens-compare-kajal-aggarwal-with-astrologist-venu-swamy

గత ఏడాది పండంటి మగ బిడ్డని కన్నది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి కాజల్ అగర్వాల్ మళ్ళీ ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఇది ( Netizens compare Kajal Aggarwal ) మాత్రమే కాకుండా కోలీవుడ్లో కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 అనే సినిమాలో నటిస్తుంది. అలాగే కాజల్ అగర్వాల్ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన సత్యభామ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఇటీవల ఆమె నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ ట్యాలెంట్ అంతా కూడా ఎంతో బాగా కనిపించింది. ఆమె ఎంతో కష్టపడి ఆ సినిమా నటించినట్టు కనిపిస్తుంది.

See also  Chiranjeevi - Ram Charan : మెగా ప్రిన్సెస్ కోసం చిరు చరణ్ లు రహస్యంగా.. ఉపాసన ఊరుకుందా?

netizens-compare-kajal-aggarwal-with-astrologist-venu-swamy

అయితే కాజల్ అగర్వాల్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాజల్ అగర్వాల్ కి జరగబోయేది ముందుగానే తెలుస్తుందని.. అచ్చం వేణు స్వామి లాగే తనకి కూడా మంచి ట్యాలెంట్ ఉందని.. సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. వేణు స్వామి సెలబ్రిటీస్ గురించి ఏం జరగబోతుందో ( Netizens compare Kajal Aggarwal ) ముందుగా చెప్పి వీడియోలు రిలీజ్ చేయడం.. అతను చెప్పినట్టుగానే జరగడం మనందరికీ తెలిసిందే. అలాగే ఆరా తీస్తే.. కాజల్ అగర్వాల్ కూడా వేణుస్వామి లాగే ముందు ఏం జరగబోతుందో తెలుసుకొని జాగ్రత్తగా ఇప్పటివరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిందని అనుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కాజల్ అగర్వాల్ కొన్ని సినిమాలను ససేమిరా చేయనని చెప్తుంది. ఆ సినిమాలు కచ్చితంగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అంటే ఆమెకు ముందుగానే ఆ సినిమా హిట్ కాదని అందులో నటించకూడదని డిసైడ్ అయ్యిందన్నమాట.

See also  Trisha : లియో సినిమాలో నటుడిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష..

netizens-compare-kajal-aggarwal-with-astrologist-venu-swamy

కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో పైసా వసూల్ సినిమా ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో మొదట కాజల్ ని నటించమని ఆఫర్ ఇచ్చారట. పెద్దగా కథ మెప్పించకపోవడంతో ఆ సినిమాకి నో చెప్పిందట. పైసా వసూల్ సినిమా పరంగా బానే ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మెప్పించలేకపోయింది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ని నటించమని అడిగారంట. దానికి కూడా కాజల్ అగర్వాల్ నో చెప్పిందంట. ఈ సినిమా కూడా ఫ్లాపే అయింది. అలాగే నాగార్జున సినిమా వైల్డ్ డాగ్, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి, రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా ఎన్నో ఫ్లాప్ చిత్రాల్లో ముందుగా కాజల్ అగర్వాల్ కి అవకాశం ఇచ్చారు కానీ.. ఆమె ముందు జాగ్రత్తతో నో చెప్పేది. అంటే కాజల్ అగర్వాల్ కూడా వేణుస్వామి లాగే జరగబోయేది తెలుస్తుందన్న మాట. వేణు స్వామికి కాజల్ అగర్వాల్ పోటీ అన్నమాట అని నటి నెటిజనులు సరదాగా అనుకొని కామెంట్ చేసుకుంటున్నారు.