Naresh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా నరేష్ మంచి పేరు సంపాదించుకున్నాడు. నరేష్ హీరోగా నటించిగా, ఆ తర్వాత సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూనే ఉన్నారు. నరేష్ ( Naresh about his relationship ) ఇప్పటికీ ఎంతో హుషారుగా సినిమాల్లో వచ్చిన పాత్రలను నటిస్తూ.. ఆడియన్స్ కు దగ్గరగా ఉన్నాడు. అయితే గత కొంత కాలంలో నరేష్ ఎక్కువగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కారణం గత కొంతకాలంగా నరేష్ కి పవిత్ర లోకేష్ కి ఉన్న రిలేషన్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నాడు నరేష్. అయితే మూడో భార్య మాత్రం.. నరేష్, పవిత్ర లోకేష్ లపై వ్యతిరేకంగా.. వాళ్ళు ఉన్న హోటల్ రూమ్ కి మీడియాని తీసుకొని వెళ్లడం జరిగింది. అప్పటినుంచి ఇంకా నరేష్, పవిత్ర లోకేష్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ( Naresh about his relationship ) రిలేషన్ అసలు ఏమిటి? ఎలా మొదలైంది? ఏం జరుగుతుంది అనే దానిపై.. మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తీయడం జరిగింది. అయితే ఆ సినిమా తీసిన తర్వాత నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటారేమో అని అందరు అనుకొని ఎదురు చూశారు. బహుశా మూడో భార్యతో విడాకులు పూర్తిగా లీగల్ గా కాలేదేమో.. అందుకే పవిత్ర లోకేష్ తో సహజీవనమే తప్ప పెళ్లి ఇంకా చేసుకునేది లేదేమో అని అనుకుంటున్నారు.
అయితే మూడో భార్యతో విడాకులు లీగల్గా పూర్తయిపోతే.. నరేష్ జీవితంలో పవిత్ర లోకేష్ నాలుగో భార్యగా ఎంటర్ అవుతుందేమో అని అనుకుంటుంటే.. మరోపక్క ఇంకొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నరేష్ కి అసలు పవిత్ర లోకేష్ నాలుగో భార్య కాదు.. ఐదవ భార్య అవ్వాల్సింది.. ఎందుకంటే.. మధ్యలో ( Naresh about his relationship ) ఒక హీరోయిన్తో నరేష్ ప్రేమ నడిపించాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడని, కానీ కొన్ని కారణాలవల్ల ఆవిడని వదిలేసాడని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో గాని.. నరేష్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ తో ప్రేమ నడిపించాడు అనే వార్తలు వస్తుంటే.. ఎవరా హీరోయిన్? ఎప్పుడు ప్రేమాయణం నడిపించాడు అని ఆత్రం అందరికీ పెరుగుతుంది.
నరేష్ , ఆమని తో కలిసి సినిమా నటించిన సంగతి మనకు తెలిసిందే. నరేష్, ఆమని కలిసి చందమామ కథలు అనే సినిమా నటించారు. ఆ సినిమాలో నరేష్, ఆమనిల లిప్ లాక్ సీన్ ఉంది. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. నరేష్ అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆమని లైన్లో పెడదామని చూశాడని.. కానీ తర్వాత ఎందుకో ఆమనిని సైడ్ చేసి పవిత్ర లోకేషన్ తో జర్నీ మొదలైందని అంటున్నారు. అసలు ఈ వార్తలో ఎలాంటి నిజం ఉన్నట్టు ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే.. అది కేవలం సినిమాలో సీన్ పోస్టర్ అంతే. ఆ తర్వాత నరేష్ గాని, ఆమని గాని ఎక్కడా కలిసి తిరుగుతున్నట్టుగానీ.. ఏదైనా కలిసి ఎక్కువగా ఎక్కడైనా ఫంక్షన్స్ లో అయినా కనబడడం గాని జరగలేదు. కాబట్టి ఇది కేవలం రూమర్ మాత్రమే అని కొందరు నెటిజనులు లైట్ తీసుకుంటున్నారు.