Netflix – Ram Charan : భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా అందరూ వెళ్ళేది సినిమాల వైపే. సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఎన్నో నేర్పిస్తుంది.. ఎన్నిటినో చూపిస్తుంది.. ఎంతో మెంటల్ రిలాక్సేషన్ కూడా ఇస్తుంది.. మంచి, చెడు రెండిటిని అందులోనే చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సినిమా అంటే ( Netflix CEO went to Ram Charan hous ) సినీ అభిమానులందరికీ ప్రాణం. అందుకే సినిమా ప్రపంచం ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటుంది తప్పితే.. కిందటి పడడం లేదు. అయితే సినిమా రంగంలో వచ్చిన మార్పు ఏమిటంటే.. ఇప్పుడు సినిమా హాల్ కెళ్ళి సినిమాలు ఎంత చూస్తున్నారో.. అంతకంటే ఇంట్రెస్ట్ గా ఓటీటీ ప్లాట్ఫారం వచ్చిన తర్వాత దానిపై ఆధారపడుతున్నారు ఆడియన్స్.
ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే సీరియల్స్ గాని, వెబ్ సిరీస్ గానీ, షార్ట్ ఫిలిమ్స్ గానీ.. ఎంతో ఎక్కువగా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అందులో కొత్తదనాన్ని వెతుక్కుంటూ కొత్త కొత్తగా అన్ని భాషల్లో వచ్చిన ప్రతి సినిమాని కూడా తిరిగి మళ్ళీ ( Netflix CEO went to Ram Charan hous ) అనేక భాషల్లోకి డబ్ చేసి మరి ఓటీటీ లో ఇచ్చేస్తున్నారు. అందుకే ఈరోజుల్లో ఎంతో సూపర్ హిట్ సినిమా అయితే తప్ప సినిమా హాల్లో ఆ సినిమాని ఎక్కువ రోజులు ఆడించడం, కలెక్షన్ రాబట్టడం కష్టంగా మారిపోయింది. ఓటీటీ ప్రపంచం వచ్చిన తర్వాత సినిమా ప్రపంచంలో ఈ మార్పు మాత్రం వచ్చింది.
ప్రముఖ ఓటిటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గురించి తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. మూవీస్,వెబ్ సిరీస్, ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి.దాన్ని ఎందరో ఫాలో కూడా అవుతున్నారు. అయితే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరిండస్ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఆరోజు తిన్నగా ( Netflix CEO went to Ram Charan hous ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఇప్పటివరకు ఒరిజినల్ మూవీస్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లైసెన్స్ మూవీస్ను కూడా చేస్తామని సీఈవో తాజాగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు లైసెన్స్ మూవీస్ కూడా చేస్తామని చెప్పడం వలన లోకల్ ఆడియన్స్ను ఆకర్షించడానికి స్థానిక నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు తీయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుంది.
ఈ సందర్భంగా ఈ విషయమై తెలుగులో స్థానిక నిర్మాతలతో కలవడానికి.. లోకల్ ఆడియన్స్ ని పెంచుకోవడానికి నెట్ ఫిక్స్ ముందుకు అడుగులు వేస్తున్న సందర్భంగా.. హైదరాబాద్ వచ్చి మెగా హీరోల్ని కలవాలని డిసైడ్ అయ్యారు. అందుకుగాను నెట్‌ఫ్లిక్స్ సీఈవో హైదరాబాద్ ఎయిర్పోర్టులో సాయంత్రం దిగిన.. టెడ్ సరండోస్ నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్న రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవి , రామ్ చరణ్, సాయి ధర్మతేజ్ , వైష్ణవ తేజ్ లతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో నిర్మాతలు యూవి క్రియేషన్స్ విక్కీ, శోభు యార్లగడ్డ కూడా పాల్గొన్నారు. ఇక నెట్ ఫిక్స్ సీఈవో హైదరాబాద్ వచ్చి.. రామ్ చరణ్ ఇంటికి వెళ్లి.. మెగా హీరోలందరినీ కలిసి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.