Home Cinema Nayanatara: నయనతార ఎంత పెద్ద స్టార్ అయినా.. చివరికి భర్త కోసం అలాంటి పని చేయక...

Nayanatara: నయనతార ఎంత పెద్ద స్టార్ అయినా.. చివరికి భర్త కోసం అలాంటి పని చేయక తప్పలేదట నిజమేనా?

Nayanatara did great job for her husband: చాలా కాలంగా చెక్కు చెదరిని అందం, పెర్సనాలిటీ తో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న హీరోయిన్ నయనతార. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ, టాప్ హీరోల సరసన వారితో సమానంగా పోటీ పడేలా నయనతార నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా తన రేంజ్ ని పెంచుకుంటూ వచ్చింది. ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ నయనతార మాత్రం చాలా సింపుల్ గా ఉంటాది. ఆమె హావభావాలు చాలా సామాన్యంగా ఉంటాయి. నయనతార సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంటాది. నిజానికి చెప్పాలంటే ఆమె కంటే, నెటిజనులే ఆమెకు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే ఆమె సినిమా విషయాలు కంటే, ఆమె పర్సనల్ విషయాలు మీద నెటిజనులు ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు.

nayanatara-did-great-job-for-her-husband

ఎంతో సౌమ్యంగా, సామాన్యంగా కనిపించే స్టార్ హీరోయిన్ నయనతార.. నిజ జీవితంలో ఆమె ప్రేమ వ్యవహారాలు అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఆమె రియల్ లైఫ్ లో హీరోలతో నడిపిన లవ్ స్టోరీస్ బాగా హాట్ టాపిక్ గా వైరల్ అయ్యేవి. దానికి తగ్గట్టే ఆమె రిజల్ట్ కూడా ఉండేది. అలా కొన్ని సార్లు లవ్ ఫెయిల్ అయినప్పటికీ చివరికి లాస్ట్ ఇయర్ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పెళ్లి జరిగింది. వీరిద్దరూ అన్యోన్యంగా, ఆనందంగా మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరవాత నయనతార (Nayanatara did great job for her husband) సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లల్ని కన్నది. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి తరవాత సినిమాలకు దూరం అవుతారు. ఇక పిల్లలు పుడితే ఇంకా బాగా బిజీ అయిపోతారు.

See also  BRO : బ్రో టికెట్స్ బుకింగ్స్ సినిమా రేంజి ఏమిటో చెప్పకనే క్లియర్ గా చెప్పేస్తున్నాయి.

nayanatara-did-great-job-for-her-husband

కానీ నయనతార మాత్రం అలా కాదు. పెళ్లి తరవాత సినిమాలతో బిజీగానే ఉంది. తన ప్రొఫిషన్ ని అస్సలు పక్కన పెట్టలేదు. అలాగే ఒకరు కాదు కవలలు ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా తాను మాత్రం సినిమాలతో బిజీగానే ఉంది. దీనిని బట్టి తనకి తన ప్రొఫిషన్ అంటే ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. అలాగని తన పర్సనల్ లైఫ్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా తన భర్త పిల్లల గురించి అన్ని ఆలోచిస్తాదని టాక్ ఉంది. కేవలం సౌత్ కి పరిమితం కాకుండా తన ట్యాలంట్ ని నార్త్ లో కూడా చూపించాలని నయనతార డిసైడ్ అయ్యింది. అందుకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా తో నార్త్ లో కూడా తన బలం పెంచుకోవడానికి అడుగులు వేస్తుంది. ప్రొఫిషన్ లో కంటిన్యూ అవ్వడానికి, ఎదగడానికి ఆడవారికి పెళ్లి పిల్లలు అడ్డం కాదని నయనతార చక్కగా నిరూపిస్తుంది.

See also  Ram Charan - Rajamouli : రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ సరసన నటించినన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

nayanatara-did-great-job-for-her-husband

ఇదిలాఉంటే ఇప్పుడు నయనతారపై మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అదేమిటంటే నయనతార అంత పెద్ద హీరోయిన్ అయ్యి ఉండి చివరికి భర్త కోసం అలాంటి పని చేస్తుందా అని కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరవాత అజిత్ ఆ సినిమా చెయ్యనని హ్యాండ్ ఇచ్చాడంట. తన భర్తకి హ్యాండ్ ఇచ్చినందుకు అజిత్ తో ఇంక నేను నటించనని నయనతార అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆగిపోయిన తన భర్త సినిమాలో ఇప్పుడు విజయ్ సేతుపతిని అజిత్ బదులుగా హీరోగా నటించమని నయనతార వెళ్లి అడిగిందట. అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి, తన భర్త కోసం ఇంకొక హీరో దగ్గరకి వెళ్లి అలా నయనతార అడగటం ఏమిటి? ఆమె భర్త వెళ్లి అడగలేడా అని ఆమె అభిమానులు వాపోతున్నారు. ఇందులో అసలు నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ఈ వార్త మాత్రం బాగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.