Home Cinema Hi Nanna Review and Rating : హాయ్ నాన్న రివ్యూ మరియు రేటింగ్ వాళ్ళు...

Hi Nanna Review and Rating : హాయ్ నాన్న రివ్యూ మరియు రేటింగ్ వాళ్ళు ఇలా ఇచ్చారు..

natural-star-nani-movie-hi-nanna-review-and-rating-revealed-by-them

Hi Nanna Review and Rating : నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా,శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాపై నాని అభిమానులకు భారీ ( Hi Nanna Review and Rating ) అంచనాలు ఉన్నాయి. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ అయిన నాని.. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో తన ఆడియన్స్ ని పలకరించేందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది? అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా లేదా బోర్ కొడుతుందా లేదా సెంటిమెంట్లో విపరీతంగా ముంచి సక్సెస్ కొడుతుందా అంటూ ఎన్నో సందేహాలు అందరిలో అలా పారుతూనే ఉన్నాయి.

Hi-Nanna-movie-review-and-rating-usa

అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా యూఎస్ఏ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ హాయ్ నాన్న మీద వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏంటో చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. నాని తన ( Hi Nanna Review and Rating ) కూతుర్ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఏది కాదనకుండా ఎంతో బాగా సింగల్ పేరెంట్గా పెంచుకుంటూ వస్తాడు. నాని కూతురికి ఒక యాక్సిడెంట్ జరుగుతున్న సందర్భంగా.. మృణాల్ ఆ పాపని రక్షిస్తుంది.అక్కడ నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారంట. ఆ తర్వాత నానికి కూడా మృణాల్ పై మంచి అభిప్రాయం ఏర్పడుతుందంట. ఆ తర్వాత నాని కూతురు నానిని అమ్మ కథ చెప్పమంటే చెప్తాడంట.

See also  Sridevi – Nayanthara : శ్రీదేవి, నయనతారలకి ఒకే రకమైన జబ్బు ఉందంట నిజమేనా?

Hi-Nanna-movie-review-and-rating-social-media

ఆ అమ్మ కథలో మృణాల్ ఎలా కనెక్ట్ అవుతుంది? అసలు ఆ అమ్మ కథలో ఏముంది? ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ ఏమిటి? లాస్ట్ కి నాని , మృణాల్ కలుస్తారా? నాని కూతురు అసలు ఏం కోరుకుంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఫుల్ క్లాస్ అండ్ సెంటిమెంట్ సినిమా అంట. ఎట్టి పరిస్థితుల్లో ( Hi Nanna Review and Rating ) మాస్ రిలేటెడ్ గా ఉండదని అంటున్నారు. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా నానికి తన కూతురుతో ఉన్న రిలేషన్ చూపించడం, మృనాల్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత లవ్ ట్రాక్ మొత్తం చూపిస్తారంట. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుందంట. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ సినిమా బాగుంది అని అనిపిస్తుంది అంట.

See also  Rangasthalam: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర మిస్ చేసుకుందా.? ఇంతకు ఆమె ఎవరు.??

Hi-Nanna-movie-review-and-rating

ఇలాంటి సినిమాకి సన్నివేశాలు స్క్రీన్ ప్లే చాలా కీలకమని, దాన్ని దర్శకుడు శౌర్యం చాలా చక్కగా చేశాడని, సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టనివ్వలేదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నాని ప్రతి సీన్ ని సూపర్ గా పండించాడంట. సాధారణంగా నాని ఎమోషనల్ సన్నివేశాలు చక్కగా చేస్తాడన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఇంకా బాగా నటించాడు అనేకంటే.. ఆ సీన్స్ లో జీవించేసాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు అయితే చాలా ఎమోషనల్ గా, చాలా అద్భుతంగా చిత్రీకరించారంట. ఈ సినిమాలో నాని మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ గాని, వాళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు కానీ చూడాలనిపించే అంత చక్కగా ఉంటాయంట. ఈ సినిమాలో రెండు పాటలు చాలా బాగుంటాయి అంట. అలాగే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా హెల్ప్ అయ్యి.. ఆడియన్స్ కి ఆ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి అంట. జెర్సీ సినిమా లాంటి సెంటిమెంట్ సినిమా నటించిన నాని ఈ సినిమాని ఇంకా బాగా ఎమోషనల్ గా నటించి ఆకట్టుకున్నాడు అంటున్నారు. ఎమోషన్స్ సెంటిమెంటు నచ్చిన ప్రేక్షకులు, కుటుంబ కథా చిత్రం గా చూడాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చాలా ఈజీగా చూడచ్చని, ఒకసారి కచ్చితంగా చూడొచ్చని అంటున్నారు. మరి ఉమెన్స్ సందు అయితే ఈ సినిమా గురించి రివ్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. నిజమో కాదో తెలియదు కానీ అతను అయితే ఏకంగా 3.5/5 ఇచ్చేసాడు. రేపు సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు చెప్తేనే మనం అసలైన రివ్యూ, రేటింగ్ లను నమ్మి అంచనాలను వేసుకోవాలి.