Home Cinema Hi Nanna public talk : హాయ్ నాన్న పై పబ్లిక్ టాక్ కన్నీళ్లు తెప్పిస్తుంది..

Hi Nanna public talk : హాయ్ నాన్న పై పబ్లిక్ టాక్ కన్నీళ్లు తెప్పిస్తుంది..

natural-star-nani-movie-hi-nanna-public-talk-brings-tears

Hi Nanna public talk : నాచురల్ స్టార్ నాని హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై నాని అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.మరి ఈ సినిమా చూసిన అభిమానులు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో ఒక్కసారి ( Hi Nanna public talk brings tears ) తెలుసుకుందాం.. సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్ సక్సెస్ అంటున్నారు. నాని సూపర్ కంటెంట్ తీసుకున్నాడు, కంటెంట్ తో కంటతడి పెట్టించాడని అంటున్నారు. ఈ సినిమాలో తండ్రి కూతుర్ల బంధం చాలా బాగుందని.. అలాగే ఒక ఫ్రెండ్ ప్రియదర్శితో ఉన్న ఫ్రెండ్షిప్ చూస్తే.. అలాంటి ఫ్రెండ్ జీవితంలో ఒక్కడైనా ఉండాలనిపించే అంత గొప్పగా తీసారని చెబుతున్నారు.

natural-star-nani-movie-hi-nanna-public-talk-brings-tears

మృణాల్ ఠాకూర్ పర్ఫామెన్స్ కూడా చాలా బాగుందని, రొమాన్స్ అదిరిపోయింది అని అంటున్నారు. ఈ సినిమాలో వైలెన్స్ గానీ, విపరీతమైన లిప్ కిస్సులు అలాంటివి గాని కాదని.. సినిమా సెంటిమెంటుతో కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ( Hi Nanna public talk brings tears ) శృతిహాసన్ కి ఏమి పెద్ద క్యారెక్టర్ లేదని, ఆమె జస్ట్ గెస్ట్ రోల్ అని.. ఆమెను పెద్దగా కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. నాని ఈ సినిమాని భుజం మీద మోసాడని, జెర్సీ సినిమా కంటే చాలా రెట్లు ఎక్కువగా ఎమోషన్ ని సినిమాలో క్యారీ చేశాడని, ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించాడని అంటున్నారు.

See also  Ritu Chowdary: పెద్ద కోడలిగా అక్కినేని ఇంటికి వెళ్లేందుకు ఆ హీరోయిన్ పెద్ద స్కెచ్.. నీకంత సీన్ లేదమ్మా అంటూ నెటిజన్స్ ఫైర్

Hi-Nanna-Public-Talk-Brings-tears-viral

సినిమాలో హీరోయిన్ కి మెమరీ లాస్ ఉందన్న పాయింట్ చెప్పారు ఆడియన్స్. క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అన్నారు. ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం ల్యాగ్ గా అనిపించినా కూడా.. సినిమా మాత్రం వెళ్లే కొద్ది అద్భుతం అని చెప్పారు. ఇక ముఖ్యంగా ( Hi Nanna public talk brings tears ) ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పనితనం అద్భుతం అని చెప్తున్నారు. సెంటిమెంట్ మొత్తాన్ని మనలో అలా ఉంచి.. బయటకు వచ్చాక కూడా దాన్ని క్యారీ చేయడానికి కారణం.. డైలాగ్స్, వెనకనుంచి వచ్చిన మ్యూజిక్, నాని పెర్ఫార్మన్స్ అని కచ్చితంగా చెబుతున్నారు. నాని కూతురుగా నటించిన కియారా నటన గురించి చెప్తే సరిపోదని.. చూస్తేనే అర్థమవుతుందని, ఎంత అద్భుతంగా చేసిందో అని అంటున్నారు.

See also  Nikhil Spy: ఆశ్చర్యంకలిగించే నిఖిల్ స్పై సినిమా మొదటిరోజు కలెక్షన్!

Hi-Nanna-Public-Talk-Brings-tears

ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అని అందరూ అనుకుంటున్నారు గాని.. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా చాలా ఎక్కువ డామినేట్ చేస్తుందని అంటున్నారు. కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉన్నా కూడా.. ల్యాగ్ అనేది లేదుగానీ కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ.. సినిమా మాత్రం ఎక్స్లెంట్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో నాని యాక్షన్ ఎక్సలెంట్ అయితే మృణాల్ యాక్షన్ ఆసమ్ అంటున్నారు. లవ్,ఎమోషన్, మ్యూజికల్ హిట్ కూడా ఉన్న సినిమా అంటున్నారు. ఎవ్వరి నోటి నుంచి కూడా నెగిటివ్ అనేది ఎక్కడ వినిపించడం లేదు. కేవలం కొంత సమయం 20 మినిట్స్ కొంచెం ల్యాగ్ గా అనిపిస్తుంది సినిమాలో అని అంటున్నారు. మిగిలిందంతా కూడా సినిమాలో చూడాల్సిన సినిమా అని.. కచ్చితంగా చూసి కన్నీళ్లు తెచ్చుకోవాలని అంటున్నారు. ప్రతి ఒక్కరిని ఏడిపించిన సినిమా అని చెప్తున్నారు. ఆడియన్స్ చెప్పేటప్పుడే ఎంతో ఎమోషనల్ గా.. కళ్ళలో నీళ్లు ఇంకా ఉన్నట్టే చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని అనిపిస్తుంది ఆడియన్స్ టాక్ చూస్తుంటే.