Home Cinema Sai Pallavi: 100 కోట్ల బడ్జెట్ సినిమాలో స్టార్ హీరో సరసన న్యాచురల్ బ్యూటీ సాయి...

Sai Pallavi: 100 కోట్ల బడ్జెట్ సినిమాలో స్టార్ హీరో సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి..

Sai Pallavi: తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టి బ్లాక్ బాస్టర్ హిట్ సంపాదించింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ కథ, కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. అలా తెలుగులో ఎంసీఏ, శ్యాం సింగరాయ్, లవ్ స్టొరీ సినిమాలతో అమ్మడు మెప్పించింది. చివరగా తెలుగులో విరాటపర్వంలో నటించి నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది

natural-beauty-sai-pallavi-opposite-star-hero-in-100-crore-budget-movie

తమిళ్ స్టార్ హీరో సూర్య నిర్మించిన గార్గి సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు, సోషల్ మీడియాలో సైతం గత కొద్ది రోజులుగా సైలెంటయ్యింది. దీంతో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపించాయి. ఇవి కాక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి డాక్టర్ చదువు కంప్లీట్ చేసి సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ కూడా వినబడింది.

See also  Naga Chaitanya: ఏంటీ.? అతను నా పక్కన నటించడమేంటంటూ దారుణంగా అవమానించిన చైతు. ఎవరినో తెలుసా.?

natural-beauty-sai-pallavi-opposite-star-hero-in-100-crore-budget-movie

తాజాగా సాయి పల్లవి తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం నెట్టింట షేక్ చేస్తుంది.ప్రస్తుత సమాచారం ప్రకారం ఆమె రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళంలో స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంలో సాయి పల్లవి ఎంపికైనట్లు టాక్ దీనికి సాయి పల్లవి కూడా ఓకే అన్నారట. సన్ పిక్చర్స్ వారు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారట.. ఇంకా తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్, తమిళ స్టార్ అజిత్ సినిమాలో కీలకమైన పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నట్టు టాక్ ఈ వార్తలో నిజమెంతుందో మరి వేసి చూడాలి.

See also  Bro Movie Preview Review : బ్రో సినిమా ప్రివ్యూ రివ్యూ..

ధనుష్-సాయిపల్లవి నటించిన మారి-2 భారీహిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాలాజీ మోహన్ తీసిన ఈ సినిమా డిసెంబర్21న 2018లో విడుదలై భారీ విజయం కైవసం చేసుకుంది.ఈ సినిమాలో రౌడి బేబీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. మళ్ళీ వీళ్ళ కాంబో రావడంతో మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.