Nani: నాచురల్ స్టార్ నాని అంటే నేచురల్ గానే అందరికీ ఇష్టం. ఈగ సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న నాని అక్కడ నుంచి ఇంక తన స్థాయిని పెంచుకుంటూ.. ఒకపక్క హీరోగా, మరోపక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఎటువంటి ( Nani and Rajamouli ) సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసుకుంటూ.. హీరో ఛాన్స్ దొరకగానే ఎంతో కష్టపడి తన నటనా ప్రతిభతో ఇంత దూరం వచ్చాడు. నిజంగా నానిని చూస్తే ఈ జనరేషన్ అబ్బాయిలందరూ ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చు.
తను పడే కష్టం చిరునవ్వుతో చేస్తూ.. ఎన్నో రకాలుగా సినిమా ఇండస్ట్రీలో నిలబడుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు నాని. అలాగే రాజమౌళి ఎటువంటి దర్శకుడు, ఎలాంటి సృష్టికర్త, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడకు తీసుకెళ్లిన దర్శకుడు ( Nani and Rajamouli ) అని కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తెలుగు సినీ అభిమానులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా రాజమౌళి లాంటి దర్శకుడు దొరకడం నిజంగా అదృష్టమని, ఎప్పటికప్పుడు మురిసిపోతూనే ఉంటారు. అలాంటి రాజమౌళికి, నానికి ఉన్న మంచి రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే.
ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆ దర్శకుడు, హీరో, అందులో వర్క్ చేసే వాళ్ళందరూ సినిమా కంప్లీట్ అయ్యేవరకు ఎంతో సరదాగా, క్లోజ్ గా ఉంటారు. ఆ తర్వాత కూడా వాళ్ళ స్నేహం చక్కగా సాగుతాది కానీ.. ఎవరి ప్రాజెక్టులో వాళ్ళ బిజీ అయిపోయి కలవడం అనేది చాలా కష్టంగా ఉంటది. అలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని ( Nani and Rajamouli ) వేడుకలకు వాళ్ళని పిలిచినప్పుడు అక్కడ కలిసి ఆనందంగా మురిసిపోతుంటారు. అలాంటి తరుణమే కీరవాణి కొడుకు శ్రీ సింహ సినిమా ఉస్తాద్ సినిమా ఫ్రీ రిలీజ్ ఓపెన్ సందర్భంగా అక్కడికి ముఖ్య అతిథులుగా రాజమౌళి, నాని రావడం జరిగింది.
వీళ్ళిద్దరూ అక్కడ ఎంతో క్లోజ్ గా, సరదాగా ముచ్చటిస్తూ గడిపారు. అయితే ఆ క్రమంలో నాని మంచి స్కెచ్ వేస్తున్నాడని రాజమౌళిని తనతో మళ్ళీ ఒక సినిమా చేయమని అడగడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళి.. మహేష్ బాబు సినిమా తర్వాత ఏం సినిమా చేస్తాడు అనేది ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి.. ఒకవేళ నాని నెమ్మదిగా రాజమౌళికి నీ ఒప్పించగలిగితే మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మరో ఈగలాంటి గొప్ప సినిమా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన రాజమౌళి.. నానితో సినిమా ఎందుకు చేస్తాడు? అతని స్కెచ్ అసలు వర్కౌట్ అవ్వదని కొందరు అంటున్నారు.. ఏమో చూడాలి మరి.