Nani take big risk about that film: నేచురల్ స్టార్ నాని గురించి పరిచయాలు అవసరం లేదు. అసలు నాని బిరుదులోనే ఉంటాది, నాని అంటే మనవాడిలా నేచురల్ గా కనిపించే వ్యక్తి అనే, నాని నటన అంటే అందరికీ అందుకే ఇష్టం. ఎంత పెద్ద క్యారక్టర్ ఉన్న సినిమా అయినా, చాలా నేచురల్ గా ఆ క్యారక్టర్ లో నటించేస్తాడు. తనకంటూ ఎలాంటి బ్యాక్‌గ్రైండ్ లేకపోయినా, కేవలం తన స్వయంకృషితో సినిమా హీరోగా ఎదిగి, స్టార్ హీరో అయ్యాడు. ఆఖరికి రాజమౌళి దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసి, పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా నానికి సరైన హిట్ దొరకడం లేదు. సరైన హిట్ కోసం నాని ఎదురుచూస్తున్నాడు. దానికి అన్నిరకాలుగా మంచి కథ, మంచి కాంబినేషన్ అన్ని చూసుకుంటున్నా, ఇటీవల కాలంలో హిట్ దొరకడం లేదు.
నాని నెక్స్ట్ మూవీ ఏమిటో మనందరికీ తెలుసు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా దసరా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా పై నానికి నాని అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇది పాన్ ఇండియా సినిమా. నాని కెరియర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో నాని సరసం హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల రిలేటడ్ తో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమా లో నాని ఇంతకుముందు కనిపించనంతగా రఫ్ పాత్రని పోషిస్తున్నాడంట. ఈ సినిమాలో నాని మాస్ ఆడియన్స్ ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాడని దానితో సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారని అంచనాలను వేస్తున్నారు.
దసరా సినిమాలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రలను పోషించగా, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తి అయ్యింది. ఈ సినిమాని మార్చి 30 వ తారీకుకి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడం వలన, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని 1500 స్క్రీన్లలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇక యూఎస్ లో అయితే, 500 ప్లస్ లొకేషన్లలో ఈ సినిమా రిలీజ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారంట. ఈ రకంగా ఇన్ని చోట్ల ఇలా రిలీజ్ చెయ్యడం అంటే, చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకి భారీ బడ్జెట్ సినిమా లని ఇలా ప్లాన్ చేస్తారు. అలాంటిది నాని సినిమాని ఇంతలా ఈ రేంజ్ లో రిలీజ్ చెయ్యడం ట్రేడ్ వర్గాలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్.. ఇలా మొత్తం 80 కోట్ల వరకు బిజినెస్ చేసారంట. ఇంత రేంజ్ చూస్తుంటే ఎందుకో నాని ( Nani take big risk about that film ) రిస్క్ చేస్తున్నాడని అందరికీ అనిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటె ఓకే, బాగానే ఉంటుంది. ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా, చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. అలా నష్టం వస్తే, వ్యాపారం చేసేవాళ్ళు పోతారు, హీరోకి ఏముందని అనుకుంటున్నారేమో. కానీ ఒక హీరో సినిమాకి నష్టపోతే.. నెక్స్ట్ ఆ సినిమా హీరోతో, డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి నిర్మాతలు, వాటిని కొనడానికి బైయర్స్ వెనకడుగు వేస్తారు. అలా నాని నష్టపోవడానికి చాలా అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. అసలు నానిని ఇంత రిస్క్ తీసుకోమని సాంతం నాకించే ఐడియా ఎవరు ఇచ్చి ఉంటారు అని నెటిజనులు డిస్కస్ చేసుకుంటున్నారు..