Home Cinema Nani : హనీమూన్ లో ఉన్న వరుణ్ లావణ్యాలకి సూపర్ జర్క్ ఇచ్చిన నాని..

Nani : హనీమూన్ లో ఉన్న వరుణ్ లావణ్యాలకి సూపర్ జర్క్ ఇచ్చిన నాని..

nani-gave-a-super-jerk-to-varun-tej-and-lavanya-tripathi-who-were-on-honeymoon

Nani : మెగా కుటుంబంలో ఇటీవల ఎంతో సందడిగా జరిగింది వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో.. వాళ్ల కుటుంబ సభ్యులు, ముఖ్యమైన సన్నిహితులతో ఆధీనంలో ఎంతో వైభవంగా చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా రిసెప్షన్ గ్రాండ్గా చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వచ్చిన ప్రతి చిన్న పండగని కూడా ఎంతో ఆనందంగా మెగా కుటుంబం ( Nani gave a super jerk to Varun and Lavanya ) చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు. అయితే ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హనీమూన్ కి కూడా వెళ్లారు. ఇప్పుడు వాళ్ళ హనీమూన్ లోనే ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలని షేర్ చేస్తున్నారు.

Nani-gave-jerk-to-Varun-Tej

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హనీమూన్ లో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ లకు నాని పెద్ద జర్క్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. అసలు హనీమూన్ కి వెళ్ళిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీకి ( Nani gave a super jerk to Varun and Lavanya ) లింక్ ఏంటి అని అనుకుంటున్నారా? అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకుందాం. డిసెంబర్ 7వ తేదీ గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాపై నాని భారీ అంచనాలే పెట్టుకున్నాడు. నాని అభిమానులైతే విపరీతంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్ మరియు పాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి.

See also  HBD Samantha: ఎన్నో ఆటంకాల నడుమ ఈ స్థాయికి ఎదిగిన సమంతకు జన్మదిన శుభాకాంక్షలు.

Nani-gave-jerk-to-Varun-Tej-lavanya

అంచనాలకు తగ్గట్టుగానే హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా సెంటిమెంట్ , ఎమోషన్ అదిరిపోయిందని, ఇందులో నాని నటన అద్భుతంగా ఉందని, జీవించేసాడని వార్తలు ( Nani gave a super jerk to Varun and Lavanya ) వచ్చాయి. ఇక ఆడియన్స్ చూసినవాళ్లు కూడా ఈ సినిమా ఎంతో చక్కగా ఉందని, ఎలాంటి వైలెన్స్, ఎలాంటి సమస్య లేకుండా సినిమా చాలా చూడ చక్కగా ఉందని, కుటుంబంతో కలిసి తప్పకుండా ఒక్కసారి అయినా ఈ సినిమా చూడాలని.. అలాంటి సెంటిమెంట్ ని చూస్తే మనకు చాలా రిలాక్స్ గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా నానికి హీట్ కింద లెక్క.

See also  Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎలాంటి స్కూల్ కి వెళ్తుందో అసలు ఫీజు ఎంతో తెలిస్తే..

Nani-gave-jerk-to-Varun-Tej-with-Hi-Nanna

అయితే ఈ సినిమా కథని దర్శకుడు శౌర్యవ్.. నాని కోసం రాయలేదంట. ఈ సినిమా కథని వరుణ్ తేజ్ కోసం రాసుకున్నాడంట. వరుణ్ తేజ్ కి సెంటిమెంట్ తో కూడా సినిమా బాగుంటుందని రాసుకొని.. మెగా కుటుంబం దగ్గరికి వెళ్ళాడంట. కథ చెప్పడానికి శౌర్యవ్ వెళ్ళినప్పుడు అసలు ఆ కథను వినకుండానే డేట్స్ లేవు నో అని చెప్పేసారంట. ఎందుకంటే.. అసలు కారణం వరుణ్ అప్పటికి లావణ్య త్రిపాఠితో పెళ్లి గురించి పెళ్లి డేట్స్ గురించి.. అన్ని ఆ బిజీ లో ఉన్నారట. అందుకనే డేట్స్ ఖాళీ లేవని చెప్పేసి పంపించేసారంట. 2023లో వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున డిజాస్టర్ గా మిగిలిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అదే 2023 చివర్లో తన వరకు వచ్చిన కథను వదిలేసుకున్న సినిమా ఇప్పుడు నాని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో హల్చల్ చేయడంతో.. నెటిజనులంతా.. అయితే నాని సినిమా హాయి నాన్న హిట్టుతో.. హనీమూన్ లో ఉన్న వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠీ లకు నాని మంచి జర్కి ఇచ్చాడన్నమాట అని నెటిజనులు సరదాగా కామెంట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా నాని సినిమా హిట్ అవ్వడం నాని అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది.