Bhagavanth Kesari 2nd day collection : నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, శ్రీలీల ముఖ్యపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాపై ( Bhagavanth Kesari 2nd day collection ) నందమూరి అభిమానులకు భారీ అంచనాలే ఉండేవి. ఎందుకంటే బాలకృష్ణ అఖండ, వీరసంహారెడ్డి వరుస రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి.. కలెక్షన్స్ బీభత్సాన్ని క్రియేట్ చేసిన సినిమాలు తర్వాత వచ్చిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాని దర్శకత్వం వహించిన అనీల్ రావిపూడి కూడా ఇంతవరకు అట్టర్ ఫ్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకోని దర్శకుడు.
ఇందులో ముఖ్యంగా ప్రజెంట్ సూపర్ క్రేజ్ లో నడుస్తున్న హీరోయిన్ శ్రీలీల ఒక మంచి పాత్రలో నటిస్తూ ఉండడం వల్ల ఈ మూడు క్రేజ్ లని మైండ్ లో పెట్టుకొని.. పైగా రిలీజ్ చేసింది కూడా దసరా హాలిడేస్ టైంలో రిలీజ్ చేయడం వలన.. కచ్చితంగా ( Bhagavanth Kesari 2nd day collection ) బ్లాక్బస్టర్ హిట్ అయి విపరీతమైన భారీ అంచనాలతో కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే సినిమాపై భారీ అంచనాలు ఉండడం వలన మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్టోబర్ 19వ తేదీ భగవంతుడు తో పాటు లియో సినిమా కూడా రిలీజ్ అయింది. లియో తెలుగు సినిమా కాకపోయినప్పటికీ, డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమాకి కూడా కొంత ప్రాధాన్యత ఉంది.
అందుకే తెలుగు వాళ్ళలో చాలామంది ఆ సినిమాకి కూడా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆ క్రమంలో కూడా మొదటి రోజు భారతదేశంలో భగవంత్ కేసరి కలెక్షన్ 20 కోట్ల వరకు వచ్చింది. అయితే ఇక రెండవ రోజు కలెక్షన్ చూస్తే కేవలం ఏడు కోట్లు మాత్రమే ( Bhagavanth Kesari 2nd day collection ) వచ్చింది. రెండవ రోజు భగవంతుడు కేసరికి లియో ఒక్కటే కాంపిటీషన్ కాకుండా.. ఇంకొక సినిమా టైగర్ నాగేశ్వరావు కూడా జత కలిసింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమా మీద కూడా అందరికీ కొన్ని మంచి అంచనాలే ఉన్నాయి.ఈ క్రమంలో మొదటి రోజు అవడం వలన, ఆ సినిమా ఎలా ఉంటాది అని ఎస్టిమేషన్ లేకపోవడం వలన, బానే ఉంటది అని అంచనా ఉండడం వల్ల ఆ సినిమాకి కూడా ప్రాముఖ్యతను ఇచ్చారు.
ఇలా భగవంతుడు కేసరికి.. లియో, టైగర్ నాగేశ్వరావు రెండు సినిమాలు పోటీ పడటం వలన.. రెండవ రోజు భగవంత్ కేసరికి కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ టైగర్ నాగేశ్వరరావు చూసిన తర్వాత టైగర్ నాగేశ్వరావుని, లియో సినిమాని ఎంతవరకు అందరూ క్యారీ చేస్తారో.. ఈ మూడిట్లో దేనికి బెస్ట్ సినిమా అని అనుకుంటారో.. దానికి కలక్షన్స్ ఇంకా ఈరోజు నుంచి పెరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో మరి భగవంత్ కేసరి మళ్లీ పెరగొచ్చు అని అనుకుంటున్నారు. ఏదేమైనా ఫస్ట్ డే 20 కోట్లు రాగా.. సెకండ్ డే 7 కోట్లు మాత్రమే అంటే.. చాలా డిఫరెన్స్ వచ్చేసింది. కానీ ఇకమీదట నుంచి పెరిగే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..