Nagarjuna Secret: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు మాత్రమే అందంగా ఉంటే సరిపోదు వాళ్ళ కంటే కొంచెం ఎక్కువ హ్యాండ్సమ్ గా హీరోలు కూడా ఉండాలి.లక్కుండి అవకాశాలు వస్తున్నా ఎదగడం చాలా కష్టతరమే.. అలా ఇప్పటికే ఎందరో హీరోలు కూడా నిరూపించుకున్నారు. కాగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే ఎందరో హీరోలు ఉన్నప్పటికీ కూడా స్టార్ హీరోలు రాజ్యం ఏలేస్తున్నప్పటికీ కూడా.. చివరికి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టి గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపుని సంపాదిస్తున్న కూడా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్.. అందరి హీరోలకు ఎక్కువగా జెన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే..
నాగార్జునకి జెన్స్ తో పాటుగా సపరేట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో అరవై ఏళ్ల వయసు పైబడినప్పటికీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల భార్యలందరికి కూడా ఆయన అభిమానులే ఉన్నారు. అంతలా మన్మధుడిగా మెప్పిస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఆయన కొడుకులు కూడా సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి రానిస్తున్నప్పటికీ కూడా అదే లుక్ తో కుర్ర హీరోలకు దీటుగా అమ్మాయిలని ఆకట్టుకుంటూ ఎంతగానో అలరిస్తున్నాడు నాగార్జున. అయితే నాగార్జున ఇంత యంగ్ గా ఉండడానికి ఆ బ్యూటీ ట్రిక్ ఏంటి.? దానికి గల కారణాలు ఏంటో ఇప్పటికే ఎన్నోసార్లు నెట్టింట ఎన్నో రకాలుగా వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూనే ఉంటారు ఆ విషయం గురించి.
అయితే అక్కినేని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సదరు విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. అందులో భాగంగా ఆ టాప్ సీక్రెట్ ని కూడా తెలియజేశారు నాగార్జున. ఇక అక్కినేని నాగార్జున ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా కచ్చితంగా తనకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే అవుతుంది. ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత ఎంగా ఎలా ఉంటున్నారు.? దాంతో మరొకసారి అదే ప్రశ్న ఇంటర్వ్యూలో రిపోర్ట్స్ అడగ్గా నాగార్జున తన ఫుడ్ సీక్రెట్ బయట పెట్టలేదు కానీ ఫిట్నెస్ సీక్రెట్ (Nagarjuna Secret) ని మాత్రం రివీల్ చేశాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అన్న విషయం గురించి నాగార్జున ఏం ఫాలో అవుతాడో ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే సదరు విలేఖరి అడిగిన ప్రశ్న. మీరు ఇలా కనబడడానికి బాగా కండిషన్స్ తో తింటారా.?
అందులో ఏమైనా సీక్రెట్ దాగి ఉందా అంటూ అడగగా నాగార్జున అందుకు సమాధానంగా ఫుడ్ లో ఏం రిజెక్షన్స్ పెట్టుకోవాల్సిన పనేలేదు. నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఐస్ క్రీమ్ తినందే పడుకోను తెలుసా.. నాకు ఐస్ క్రీం తినకుంటే నిద్ర కూడా పట్టదు. ఒకవేళ అందుబాటులో ఏ స్వీట్ లేకపోయినా సరే డెసర్ట్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే.. నా బాడీ సిస్టంలా పనిచేస్తుంది. రోజు ఇది తినాలి ఖచ్చితంగా ఎక్ససైజ్ చేయాలి అంటూ ఒకటే రొటీన్ గా ఉంటుంది. ఒకవేళ నేను స్పెషల్ ఫుడ్ ఏదైనా తిన్నా కూడా మిగిలినవి కూడా కచ్చితంగా తింటాను. అందుకు తగ్గ వర్కౌట్ చేస్తూ కేలరీలన్నీ బర్న్ చేసే ప్రయత్నం కచ్చితంగా చేస్తాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను తిన్న తర్వాత కచ్చితంగా నైట్ వాక్ చేయడం కంపల్సరీ. అందువల్లే నేను ఇంత ఎంగా కనిపిస్తున్నానంటూ నాగార్జున తెలియజేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ వాక్యాలు వైరల్ గా మారాయి.