Home Cinema ANR: అమలతో నాగార్జున పెళ్లి ఏఎన్ఆర్ కు ఇష్టం లేకపోయినా ఆ ప్రొడ్యూసర్ వాళ్ల పెళ్లి...

ANR: అమలతో నాగార్జున పెళ్లి ఏఎన్ఆర్ కు ఇష్టం లేకపోయినా ఆ ప్రొడ్యూసర్ వాళ్ల పెళ్లి చేశారట.. కోపంతో ఏఎన్నార్..

Nagarjuna Father ANR: అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇప్పుడున్న యువకులకు తెలియకపోవచ్చు, పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ మన ముందు తరం వాళ్లకైతే కచ్చితంగా ఆయన అంటే తెలిసి ఉంటుంది. నాడు చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమని నేడు హైదరాబాద్ కి తీసుకు రాగలిగారంటే అది కేవలం అక్కినేని నాగేశ్వరరావు కృషి తోనే సాధ్యమైంది అని చెప్పాలి. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి పరిచయమే.. ఎన్నో సినిమాలు, ఎన్నో విజయాలు, మరేన్నో అవార్డులు తన సొంతం.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన కృషి అమోఘం, అనిర్వచనీయం.. ఇంత గొప్ప ఏఎన్ఆర్ మరి తన కొడుకు విషయంలోనే కాకుండా తన మనవాళ్ళ విషయంలో కూడా బ్రతికున్నన్ని రోజులు ఎంతో బాధపడుతూ ఉన్నాడట.

See also  Ram Charan : ఆ హీరోయిన్ ని తీసుకుంటే.. నేను ఈ సినిమాలో నటించనని చెప్పిన రామ్ చరణ్..

nagarjuna-got-married-by-that-star-producer-against-his-father-anr-will

అయితే అక్కినేని నాగార్జునకు సినిమాల్లో రాకముందే దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారట.. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట వివాహం అనంతరం చాలా సంతోషంగానే గడిపారట కానీ.. ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న గొడవల కారణం చేత నిత్యం దూరం అవుతూ చివరికి విడాకుల వరకు వెళ్లారు. ఇక అప్పటికే ఈ జంటకు నాగచైతన్య కూడా పుట్టినప్పటికీ వీళ్లు తమ కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అని ఒక్క మాట కూడా ఆలోచించకుండా విడిపోయారు. ఇక ఆ తర్వాతే నాగార్జున నటించిన కిరాయి దాదా, శివ, నిర్ణయం అనే సినిమాల్లో తనతో కలిసి నటించిన హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడట.

See also  Ram Charan : ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ ఘాడంగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ చనిపోయింది.. కారణం..

nagarjuna-got-married-by-that-star-producer-against-his-father-anr-will

అయితే ఈ విషయం తెలిసిన ఏఎన్ఆర్ కు అమలతో నాగార్జున వివాహం జరిపించి తనను ఇంటి కోడలుగా ఒప్పుకోవడానికి ససే మీరా వద్దని తెగేసి చెప్పాడట.. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నాగార్జున మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే అమలనే చేసుకుంటాను.. నీకు ఇష్టం లేకపోయినా సరే నాకు సంబంధం లేదు.. అంటూ నాగార్జున తన తండ్రితో చాలా పెద్ద గొడవలు పెట్టుకున్నారట.. మొట్ట మొదటి సారి నాగార్జున తన తండ్రి (Nagarjuna Father ANR) ఏఎన్నార్ ను ఎదిరించి మాట్లాడారట.. అయితే ఏఎన్ఆర్ మాత్రం ఇంత వాదించినప్పటికీ కూడా నాగార్జున అమల పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో వీళ్లిద్దరి పెళ్లిని ఆ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గరుండి జరిపించాడట..

See also  Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం...

nagarjuna-got-married-by-that-star-producer-against-his-father-anr-will

మరి ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు నాగార్జున నటించిన కిరాయి దాదా సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన దొరస్వామి. వీళ్ళిద్దరూ ఎంత పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారు అని గ్రహించి అర్థం చేసుకున్న దొరస్వామి.. ఏఎన్నార్ కి ఇష్టం లేకున్నా సరే దగ్గరుండి నాగార్జున అమల పెళ్లి చాలా సింపుల్ గా తిరుపతిలో చేయించాడట.. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఏఎన్ఆర్ అప్పట్లో దొరసామిని తన మాటలతో ఏకీ పీకి పడేసాడని అప్పట్లో చాలా వార్తలే వినిపించినప్పటికీ వినిపించాయి.. ఇదే కాకుండా ఇంకోసారి నా కంటికి కనబడ్డావో అసలు బాగుండదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడని అప్పట్లో ఇండస్ట్రీలో చాలా గుసగుసలే వినిపించాయట.