Nagarjuna : తెలుగు సినిమా కి ఒక కన్ను NTR అయితే మరో కన్ను ANR, అలాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీ ప్రవేశం చేసిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినీ హీరోగా నిలదొక్కుకోవడమే కాకుండా సక్సెసఫుల్ బిజినెస్ ( Nagarjuna birthday special ) మ్యాన్ గా అనేక శిఖరాలు అధిరోహించాడు అంటే అతిశయోక్తి కాదు. 1986 లో తన మొదటి సినిమా విక్రమ్. అప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ గా మల్టీ టాలెంటెడ్ గా పేరు పొందిన మధుసూదన్ రావు డైరెక్షన్ లో అన్నపూర్ణ బ్యానర్ పై శోభన హీరోయిన్ గా మ్యూజిక్ లో మ్యాజిక్ మాస్టర్ గా పేరొందిన చక్రవర్తి మ్యూజిక్ లో సినిమా రిలీజ్ అయింది. ఎన్నో అంచెనాలతో రిలీజ్ ఈ సినిమా పాస్ మార్క్స్ తెచ్చుకునింది.
సినీ ప్రవేశం చేసిన మూడు సంవత్సరాలు కూడా కాకుండానే ఇండియా ఫిల్మ్ గమనాన్ని మార్చే డేరింగ్ డిసిషన్ నాగార్జున తీసుకోవడం వలన ఈరోజు తెలుగు సినిమానే కాదు భారతీయ చలనచిత్ర రంగం ఇలా ఉంది. అవును మీరు అనుకుంటున్నది నిజమే , మనం ( Nagarjuna birthday special ) ఇప్పుడు చెప్పుకోబోయేది శివ సాధించిన విజయం గురించి ఆసినిమా సలెక్ట్ చేసి, రామ్ గోపాల్ వర్మకి నాగార్జున ఇచ్చిన అవకాశం గురించి. సినిమాని సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో , హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో శివ సినిమా వేసిన బాట శాశ్వతం.
అప్పటి వరకు సినిమా తీయటానికి వాడిన కెమారాలు, సౌండ్స్ , లైట్ ఎఫెక్ట్స్, పోస్టర్ డిజైన్ , పబ్లిసిటీ , విలనిజం అన్నీ మారిపోయి .. శివ ముందు శివ తరువాత అనేవిధంగా నాగార్జున శివ నిజమైన ట్రెండ్ సెటర్ గా నిలిచింది. రొమాంటిక్ హీరోగా , అమ్మాయల కలల రాకుమారిడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య భక్తి సినిమా తో ( Nagarjuna birthday special ) మరో సారి తెలుగు ప్రేక్షుకులనే కాదు.. భారత దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేటట్టుచేశాడు. అనేక రాష్ట్ర , జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న నాగార్జున అన్నమయ్య. జాతీయ చలచిత్ర అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ కింద జాతీయ స్థాయిలో ఉత్తమ హీరో గా కూడా అవార్డు సొంతం చేసుకున్నాడు.
అన్నపూర్ణ బ్యానర్ ని అత్యంత సమర్ధవంతగా నడుపుతూ అనేక మందికి అవకాశాలు ఇచ్చాడు నాగార్జున. అటు బుల్లి తెరలో సైతం ప్రవేశించి మా టీవీ లో వాటాలు కొన్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి అత్యంత ప్రజాధారణ పొందేవిధంగా హోస్ట్ చేసి ఔరా అనుపించుకున్నాడు. ఇప్పటికీ అత్యంత గ్లామర్ గా తన కొడుకుల కంటే అందంగా, ఫిట్ గా కనపడుతూ నవ మన్ముదుడిగా ప్రేక్షుకులని ఎప్పటిలాగే ఎంటర్టైన్ చేయాలని, ఆ దేవుడి దీవెనలతో మంచి ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుషుతో బతకాలని కోరుకుంటూ Telugu Truth తరపున నాగార్జున గారికి ప్రత్యేకంగ పుట్టినరోజు శుభాకాంక్షలు..