Home Cinema Ayesha Takia: ప్రేమించినోడి కోసం తన సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..

Ayesha Takia: ప్రేమించినోడి కోసం తన సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..

Nagarjuna Actress Ayesha Takia: మొదటి సినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ తన సినీ జీవితాన్నే ప్రేమకోసం త్యాగం చేసి పక్కన పెట్టేసింది. మరి ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె తన ప్రేమ కోసం ఏకంకా సినీ జీవితాన్ని ఎందుకు వీడిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో నాగార్టున హీరోగా వచ్చిన సూపర్ సినిమా మీకు గుర్తుంది కదా.? హ ఆ సినిమాలో మైయిన్ హీరోయినే ఆయేషా టాకియో, ఇందులో ఇంకొక హీరోయిన్ కూడా ఉంది ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అనుష్క కూడా. ఈ సినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఆయేషా టాకియో టాలీవుడ్ లో నటించడానికి ఇష్టపడలేదు.

See also  Jabardast Contestant: బిగ్ బాస్ గురించి అంతా తెలిసి మరీ అందులోకి అడుగుపెట్టబోతున్న జబర్ధస్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా.?

nagarjuna-actress-ayesha-takia-destroyed-her-movie-career-for-her-boyfriend

మొదటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తరువాత ఎందుకో తెలియదు వరుస అవకాశాలు టాలీవుడ్ లో వస్తున్నప్పటికీ ఇక్కడ నటించకుండా బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించేది. ఇదేకాక బాలీవుడ్ లోని స్టార్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ అనే చిత్రంలో నటించింది. ఇంకా ఇవే కాకుండా బాలీవుడ్ లో షాది నంబర్ వన్, టార్జన్ ది వండర్ ఫుల్ కార్, దిల్ మాంగే మోర్ అనే ఎన్నో చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది ఆయేషా. మంచి ఆఫర్లు అందుకుంటూ తన కెరియర్ దూసుకుపోతున్న సమయంలో.. తన ప్రేమ కోసం సినీ ఇండస్ర్టీనే వదిలేసింది.

See also  Virupaksha: విరూపాక్ష ని ఆ స్టార్ హీరోయిన్ మిస్ అవ్వడానికి కారణం ఆమెలో అదేనంట!

nagarjuna-actress-ayesha-takia-destroyed-her-movie-career-for-her-boyfriend

అయేషా టాకియో కేవలం తన 19 సంవత్సరాల వయసులో ఫరాన్ హజ్మీ (Nagarjuna Actress Ayesha Takia) అనే అతనితో ప్రేమలో పడింది. ఇక ఆ ప్రేమను పెళ్ళిగా మార్చుకుని 2009 అతనితో కలిసి ఏడడు అడుగులు వేసింది ఆయేషా. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం.. అయేషా టాకియో సినిమాల్లో నటిస్తున్న సమయంలో రోజూ ఓ రెస్టారెంట్ కి వెళ్ళేదంట. ఐతే ఆ రెస్టారెంట్ ఓనరే ఫరాన్ హజ్మీ, అలా అయేషా రోజు ఆ రెస్టారెంట్ కి పోయేదంట అలా వీళిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్ళి వరకూ వెళ్ళింది. అలా నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వీళ్ళిద్దరూ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

See also  Mangalavaaram : మంగళవారం సినిమాకి ఆ మెగా హీరో వలన ఎం జరిగిందో తెలుసా?

nagarjuna-actress-ayesha-takia-destroyed-her-movie-career-for-her-boyfriend

వీళిద్దరి వివాహం జరిగిన తర్వాత కూడా బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు ఆయేషా టాకియా కి వచ్చాయి కానీ ఆమె సినిమాల్లో నటించలేదు. అంతేకాక పెళ్ళయాక మతం మార్చుకుని మరీ ఇస్లాం మతంలోకి వెళ్ళి పోయింది. ఐతే ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో మనీషా కోయిరాలా తమ్ముడైనటువంటి సిద్దార్ద్ కోయిరాలాతో ఏఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని నిరూపిస్తూ ఆయేషా ఫరాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ఇక ఆయేషా టాకియో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటుంది.