Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమధ్య ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు.. గతంలో మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత రకరకాల కారణాల చేత ఏవేవో మనస్పర్ధలు కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు.
ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి ఆ తర్వాత ఒకరికి ఒకరు దూరమయ్యారు. అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూనే ఉంది. ఇదే క్రమంలో రీసెంట్ గా శోభిత దూళిపాళ్లతో చైతన్య లవ్ ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ డేటింగ్ కూడా చేస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపించాయి.
వాళ్లకు సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇదే క్రమంలో శోభిత ధూళిపాళ్లతో ముంబైలో నాగచైతన్య దిగిన ఫోటో వైరల్ అయింది. అంతేగాక నాగచైతన్య ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ముంబై కి వెళ్లి తనతో ఉంటున్నాడని తనతో డేటింగ్ చేస్తున్నాడని మిగతా టైం లో హైదరాబాదులో ఉంటున్నాడని తెలుస్తోంది. ఇదేకాక ఇన్నాళ్లు అక్కినేని ఫ్యామిలీ శోభిత ధూళిపాళ్ల పై నెగిటివ్ గా ఉండేవాళ్ళు..
కానీ ప్రస్తుతం వాళ్ళ ఇద్దరు పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఆయన నటించిన కష్టడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగచైతన్య పెళ్లి అప్డేట్ అఫీషియల్ గా చెప్తారనే సమాచారం బయటకు వస్తుంది. మరి చూడాలి నాగ చైతన్య రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాడో..