సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన హీరో, హీరోయిన్స్ ప్రేక్షుకుల అభిమానాన్ని పొంది అందులో నిలబడటం కోసం ఎంతో కృషి చేస్తారు. వారికి ఒక గుర్తింపు వచ్చి, అభిమానుల ఆదరణ పొందిన తరవాత వారి ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ అయ్యిందని ఆనందంగా ఉంటారు. వచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకునే క్రమంలో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. సక్సస్ రేట్, అభిమానులు పెరిగే కొద్దీ… వారి పర్సనల్ లైఫ్ మీద కూడా అందరికి ఆశక్తి పెరుగుతుంది.
ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? ఆ హీరోయిన్ ఎవర్ని ప్రేమిస్తుంది అంటూ ఆశక్తి పెరిగేలా గాసిప్స్ కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఎంతమంది ఎన్ని సార్లు అడిగినా, మన హీరో, హీరోయిన్స్ మాత్రం కంగారు పడి ఏమి చెయ్యరు. వాళ్లకు నచ్చినప్పుడు నచ్చినవారినే వివాహం చేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఫాన్స్ దృష్టి గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పెళ్లి మీద పడింది. వరుణ్ తేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఎవరిని చేసుకుంటాడు అంటూ కొన్ని ఇంటర్వూస్ లో కూడా అడగడం జరిగింది.
ఈ మధ్య నాగబాబు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయనకు సంబందించిన అనేక విషయాలపై చర్చించారు. అందులో ఆయన పిల్లలు గురించి కూడా కొన్ని విషయాలను చెప్పారు. తాను పిల్లలకు స్వేచ్ఛను ఇస్తానని, వారి ప్రైవసీకి భంగం కలిగేలా ప్రవర్తించనని చెప్పారు. నిహారికా, వరుణ్ తేజ్ ఇద్దరూ వేరు వేరుగా ఉంటున్నారని, వారు వేరుగా ఉన్నా మానసికంగా అందరం కలిసి ఉంటామని నాగబాబు అన్నారు. అలాగే వరుణ్ పెళ్లి గురించి అడిగితే పెద్దవాళ్ళు చూసిన పెళ్లి సంబంధమే చేసుకుంటాను అని చెప్పాడని చెప్పారు. మొత్తానికి పెళ్ళికి ముందే వరుణ్ తేజ్ వేరు కాపురం పెట్టాడన్నమాట.