Home Cinema Naga Vamsi : పవన్ కళ్యాణ్ వలన సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు

Naga Vamsi : పవన్ కళ్యాణ్ వలన సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు

naga-vamsi-comments-on-pawan-kalyan-and-jr-ntr-movies-became-viral

Naga Vamsi : ఒక సినిమా తీస్తున్నారు అంటే ఆ సినిమా వల్ల ఎందరికో ఎన్నో లాభాలు, అలాగే సినిమా నష్టపోతే ఎందరికో ఎన్ని నష్టాలు ఉంటాయి. ప్రేక్షకులు చూసిన వెంటనే బాగుంది, బాలేదు అని రెండున్నర గంటల సినిమా చూడగానే చెప్పేసినంత ఈజీగా ఉండదు తీసిన వాడి బాధ. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు ( Naga Vamsi comments on Pawan Kalyan and Jr NTR ) ఏం కోల్పోతారు, దాన్నుంచి తేరు తేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో కూడా ఎవరికీ తెలీదు. కొన్ని కాంబినేషన్లో సినిమా అంటే గ్యారెంటీ సక్సెస్ అనే హోప్ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలు అంటే అందరికీ ఎంతో ఎక్కువగా అంచనాలు ఉంటాయి.

Naga-Vamsi-comments-Pawan-JrNtr

వీళ్ళిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. అలాంటి అంచనాలతోనే అజ్ఞాతవాసి సినిమా తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ ( Naga Vamsi comments on Pawan Kalyan and Jr NTR ) అయ్యే భయంకరమైన డిజాస్టర్ సినిమా గా నిలిచింది. 2018 సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రోజుల్లో సినిమా హాల్స్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉన్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ.. ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఎన్నో అంచనాలతో పవన్ కళ్యాణ్ సినిమాలు తీశాం.

See also  Hyper Aadi Marriage : యూట్యూబ్ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్.. కన్ఫామ్ చేసిన ఈటీవీ అధికారిక వెబ్సైట్.

Naga-Vamsi-Pawan-JrNtr-movies

కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. రెండు రోజుల్లోనే సినిమా హాల్స్ లో నుంచి బయటికి వెళ్లిపోయింది.ఈ సినిమా తీసి మేము విపరీతంగా నష్టపోయాం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే రోడ్డు మీదకు వచ్చేసారు. అలాంటి స్థితిలో నేను రెండు నెలలపాటు ఇంకెవరితో ఏమీ మాట్లాడకుండా, ఏం ( Naga Vamsi comments on Pawan Kalyan and Jr NTR ) చేయాలో అర్థం కాక ఆ నష్టాన్ని ఏం చేసుకోవాలో ఎలా బతికి బట్ట కట్టాలో అర్థం కాని పరిస్థితిలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించే పరిస్థితి వరకు వెళ్లాను. కానీ అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి మనం వెంటనే ఈ ఎడాదే ఇంకొక సినిమా తీసి.. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలని చెప్పాడు. అప్పుడు వెంటనే ఏం సినిమా తీయాలి, ఎవరితో తీయాలి అని ఆలోచనలో పడ్డాం. అప్పుడు కనిపించాడు మాకు దేవుడులా జూనియర్ ఎన్టీఆర్.

See also  Chiranjeevi - Venkatesh: చిరంజీవి, వెంకటేష్ లకు అప్పట్లో ఆ యువ హీరో నిద్ర పట్టకుండా చేశాడా.??

Naga-Vamsi-comments-Pawan-JrNtr-movies

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేశాం. ఈ సినిమా ఊహించిన దానికంటే కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతే ఆ సినిమాకు వచ్చిన లాభాలతో పవన్ కళ్యాణ్ సినిమా వలన వచ్చిన నష్టాలను మొత్తం తీర్చుకున్నాను. అప్పుడు మేము తేరుకోగలిగాము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యాపారమైన ఏది చేసినా కూడా అది ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుందో, ఎలా ఫెయిల్ అవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఆసరా దొరికితే పర్వాలేదు. ఒకవేళ ఎటువంటి ఆసరా దొరక్క నష్టాలను భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాతో వచ్చిన నష్టాన్ని జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో తీర్చుకున్నామని నాగ వంశీ చెప్పడం జరిగింది.