Home Cinema Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

naga-shaurya-rangabali-review-and-rating-of-this-movie-is-only-for-timepass

Rangabali movie Review : చిత్రం: రంగబలి (Rangabali )
తారాగణం: నాగశౌర్య, యుక్తి తరేజా, గోపరాజు రమణ, సత్య, షైన్ టామ్ చాకో మొదలగువారు..
కెమెరా: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
సంగీతం: పవన్ సీహెచ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : పవన్ బాసంశెట్టి
విడుదల తేదీ:07 జులై 2023 ( Naga Shaurya Rangabali review and rating )

నాగ శౌర్య హీరోగా, యుక్తి తరేజ హీరోయిన్గా, పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రంగబలి అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాలో కామెడీ చాలా ఎక్కువగా ఉంటుందని.. సొంత ఊరు మీద మంచి ప్రేమ, ఎమోషన్ కనిపిస్తుందని.. సెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని.. కొన్ని అంచనాలు వేసుకున్నారు సినీ అభిమానులు. అయితే అందరి అంచనాలు నిజమయ్యయో లేదో తెలుసుకోవాలంటే మనం సినిమా కథలోకి వెళ్దాం..

naga-shaurya-rangabali-review-and-rating-of-this-movie-is-only-for-timepass

కథ.
సినిమా మొదలు శౌర్య అనే కుర్రోడు ఎంటర్ అవుతాడు. తన గురించి తాను చెబుతాడు. ఆ పిల్లాడు ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ లో పడిపోతూ ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్స్ అగాధం ఇంకా మిగిలిన వాళ్ళని పరిచయం చేస్తాడు. సౌర్యాకి అందరూ తనమీద అటెన్షన్ పెట్టడం.. అందరూ తనని చూడడం అంటే ఇష్టం. దానికోసం ఏమైనా చేస్తాడు. వైట్ షర్ట్ వేసుకుంటే ఎవరినైనా కొట్టగలడు. అందరి అటెన్షన్ కావాలి.. అందరి దగ్గర తన షో చూపించుకోవాలనుకుంటాడు కాబట్టి తనకి షో అని పేరు వచ్చింది. షో ( నాగ శౌర్య ) పెద్దవుతాడు. ఊర్లో బలాదూర్ గా తిరుగుతూ ఉంటాడు. షో కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు అగాదం ( సత్య) అందరి బాధలు చూస్తే ఆనందిస్తాడు. రెండవ ఫ్రెండ్ లేడీస్ టైలర్. షో తండ్రి మెడికల్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. కొన్ని కారణాల వలన షో ని తన తండ్రి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ షో కి సహజ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. షో.. సహజ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా షోని ప్రేమిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తండ్రి దగ్గరికి వెళ్లి తన ప్రేమ గురించి చెప్తాడు. అప్పుడు అతను షో ఊరు గురించి ఆ ఊర్లో ఉన్న రంగబలి అనే సెంటర్ గురించి తెలుసుకుని తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోనని చెప్తాడు. దానికి రీజన్ కూడా చెప్తాడు. అసలు హీరోయిన్ తండ్రి చెప్పిన రీజన్ ఏమిటి? షో ఏం చేశాడు? చివరికి హీరో షో కి సహజకి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా ఈ క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Sobhan Babu : తనకెంతో ఇష్టమైనది చివరి రోజుల్లో దూరం కావడంతో శోభన్ బాబు ఏం చేశారో తెలుసా?

naga-shaurya-rangabali-review-and-rating-of-this-movie-is-only-for-timepass

సినిమా ఎలా ఉందంటే..

ప్రతీ సినిమాకి ఒక మూలం ఉంటాది. ఈ సినిమాకి మూలం సొంత ఊరు అంటే ప్రాణం. పండగ అయినా పాడి అయినా అక్కడే అనే నినాదంతో సినిమా ఉంటుందని ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధమవుతుంది. సినిమా మొదలు పరవాలేదు అనిపిస్తుంది. హీరో ఎంట్రెన్స్ చూపించడానికి దర్శకుడు బాగా హైలెట్ చెయ్యాలని చూపించాడు. హైలెట్ అవ్వకపోయినా యావరేజ్ గా ఉంది. హీరో ఎంట్రెన్స్ తరవాత ఒక ఫైట్ ఉంటుంది. ఒక్క మనిషి అంతమందితో ఫైట్ చేసెయ్యడం.. వాళ్ళు ఎవ్వరూ ఏమి హీరోని చేయలేకపోవడం అనేది చాల ( Naga Shaurya Rangabali review and rating ) సినిమాల్లో తీస్తారు గాని.. ఎందుకో కొన్నిటిలో అది ఒప్పుకునే విధంగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో ఆ ఫైట్ చాలా ఎగతాళిగా అనిపించింది. చుట్టూ ఎక్కువమంది చుట్టుముట్టినప్పుడు ఎదో ఒక లాజిక్ వాడి ఫైట్ చేయకుండా.. కేవలం మన సొంత ఊరిలో మనల్ని ఆపేదెవరు అని అనుకుంటూ ఉంటె మాత్రం అంతమందిని కొట్టేయగలడా? పైగా ఆ సీన్ కి అంతమంది అవసరం కూడా లేదు అనిపించింది. కేవలం హీరోని హైలెట్ చేయడానికి తప్పితే.. ఆ ఫైట్ అవసరం, అంత దమ్ము కూడా కనబడలేదు. ఇక నాగశౌర్యని షర్ట్ తీయించి అస్తమాను బాడీ ని చూపించడం కూడా ఏమి బాలేదు.

naga-shaurya-rangabali-review-and-rating-of-this-movie-is-only-for-timepass

హీరో తండ్రి పాత్ర అన్ని సినిమాల్లోలానే రాసుకున్నాడు దర్శకుడు. రొటీన్ సగటు తండ్రి పాత్ర అయినా కూడా అతను బాగానే చేసాడు. ఆ పాత్రవరకు దర్శకుడు బాగానే రాసాడు, బాగానే అవుట్ ఫుట్ కూడా తెప్పించుకున్నాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ తో నడిపించడం బాగానే ఉంది కానీ.. దానికి సత్య ( అగాదం ) పాత్ర మాత్రమే ప్రాణం పోసింది. దర్శకుడు ఈ పాత్రని బాగా రాసుకుని, కామెడీ ని బాగానే పండించాడు. హీరోయిన్ కి మొదటి ( Naga Shaurya Rangabali review and rating ) సినిమా అయినప్పటికీ తనకి ఇచ్చిన పాత్ర వరకు బాగానే చేసింది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పరవాలేదు అనిపించింది. కాలేజీలో హీరోయిన్ ని ఏడిపించే విలన్ కు ఇమాజినేషన్ లో చూపించిన ఫైట్ సీన్ ఓకే అనిపించింది. పాటలు పెద్దగా లేవు. ఎదో యావరేజ్ గా ఉన్నాయి. క్లాస్ గా డీసెంట్ గా ఉండే హీరోయిన్ ని సడన్ గా ఒక పాటలో అంత ఎక్సపోజ్ చేస్తూ చూపించడం.. చాలా విసుగ్గా అనిపించింది. హీరోయిన్ తండ్రి మురళి శర్మ పాత్ర ఎప్పటిలానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఎదో పరవాలేదు అనిపించింది.. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో నైనా ఎం చూపిస్తాడో అనే ఆశతో..

See also  Ramya Krishna : పెళ్ళికి ముందు అతనితో రమ్య కృష్ణ సహా జీవనం.. ఎవ్వరికి తెలియని నిజం ఇది..

హీరోయిన్ తండ్రి హీరోకి చెప్పిన ఒక రీజన్ తో సినిమా అసలు కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. అక్కడ నుంచి సినిమాని సీరియస్ చూపించాలని దర్శకుడు అనుకున్నాడు గాని.. సినిమాలో సీరియస్ నెస్ ఫీల్ అవ్వలేదు కానీ.. ప్రేక్షకుడికి మాత్రం కోపం, విసుగు మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో దర్శకుడు.. అప్పుడప్పుడు హీరోయిన్ ని నేను కూడా ( Naga Shaurya Rangabali review and rating ) ఉన్నాను సుమీ అన్నట్టు.. ఫోన్ లో చూపించడం.. కామెడీ మరవకూడదన్నట్టు.. అది కాస్తా రాసుకున్న మంచి కామెడీ ఫస్ట్ ఆఫ్ లో వాడేయగా.. మిగిలిన దానిని బలంతంగా ఇక్కడ ఇమిడ్చినట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర చీమ కంటే చీప్ గా అనిపించింది. అందుకే హీరో ని ఎంత హైప్ తీసుకుని వెళ్లి చూపించినా కూడా.. అది చాలా సిల్లీగా అనిపించింది. ఇక సినిమాలో సెంటిమెంట్ బాగా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు.

కానీ హీరోకి ఎవరితోనూ సెంటిమెంట్ ని పండించే రోల్ ఇచ్చినా కూడా ఏది పండలేదు. హీరో మెయిన్ సెంటిమెంట్ కంటే.. హీరో తండ్రికి తన మెడికల్ షాప్ సెంటిమెంట్ సినిమాలో బాగా పండింది. ఇక సినిమాలో అసలు ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. అప్పుడు దర్శకుడు బాగా గుర్తుకు వచ్చాడు. ఈ సినిమాలోనే ఒక స్టూడెంట్ ఎదో డైలాగ్ తో బెదిరిస్తే.. హీరో ఇలాంటి డైలాగ్స్ ఇంకా వాడుతున్నారా బయ్యా అని అడుగుతాడు. ఇప్పడు దర్శకుడు కనిపిస్తే.. ఇంకా ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లు రాస్తున్నారా బయ్యా అని అడగలనిపిస్తాది. అక్కడితో సినిమా మీద ఉన్న అన్ని అంచనాలు చాలా వరకు పోతాయి. కొత్త దర్శకులకి నిర్మాతలు బడ్జెట్ కన్వీనెంట్ గా ఉండటాడని ఆలోచించవచ్చు గాని.. ప్రేక్షకుడు మాత్రం టికెట్ ఖర్చులో మార్పు రాకపోయినా .. కొత్త దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపిస్తాడనే ఆశతోనే సినిమాకి వెళ్తాడు. ఆ కొత్తదనం బాగోకపోయినా పరవాలేదు.. ఎదో ఒక కొత్త చూస్తాడు. కానీ కొత్త దర్శకులు కూడా ఇలా పాతదనంతో ముందుకు వస్తే.. వాళ్ళ భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుందో తెలీదు.

హీరోకి ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తరవాత సినిమా ఇంకా సిల్లీగా అనిపించింది. విలన్ దగ్గరకు వెళ్లి.. ఈ స్టోరీ వాడిది, వీడిది కాదు.. అసలు నాదే అని అర్ధం అయ్యింది అంటే.. సినిమాలో హీరోకి కూడా లింక్ ఉంది అని ఫీల్ అవ్వండి అని ఆడియన్స్ ని అడిగినట్టు ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ నటన కూడా బాగానే ఉంది కానీ.. చాలా బోర్ కొట్టింది. ఇక హీరో ( Naga Shaurya Rangabali review and rating ) సమస్యని ఎలా పరిష్కరిస్తాడో చూడాలని అందరూ వెయిట్ చేస్తే.. దాన్ని చాలా సింపుల్ గా తేల్చేసాడు. క్లైమాక్స్ ని అదరగొట్టాలని దర్శకుడు అనుకుని సప్తపది మీడియా వాళ్ళ పాత్రలను పెట్టాడు గాని.. అసలు అందరిలో అంత మార్పు సడన్ గా వచ్చేసినట్టు సినిమా తియ్యడం అంటే.. ఆ విధానం ఒక కమర్షియల్ సినిమాలా లేదు. కామెడీ సినిమాలు అల్లరి నరేష్ వి వచ్చేవి. అందులో పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో జరిగేవి అన్ని.. అందులో సింపుల్ గా, సిల్లీ గా అయిపోతుంటాయి. దానికి ఆడియన్స్ ఒప్పుకుంటారు.

See also  Sai Pallavi : సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి గురించి ఊహంచని నిజాలు బయటకు వచ్చాయి..

ఎందుకంటే అది కామెడీ సినిమా. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. కానీ ఇలాంటి సినిమాల్లో ఇలా చూపిస్తే.. నవ్వరు,ఏడవరు, కోప్పడరు గాని.. చిరాకు మాత్రం పడతారు. సినిమాలో క్లైమాక్స్ ఎలా ఆపాడు అంటే.. అందరివీ డేట్స్ అయిపోయాయి.. మిగిలింది మీరు అర్ధం చేసుకోండి అన్నట్టు ఆపాడు. ఇక హీరో చిన్నప్పుడు జరిగిన అంత ముఖ్యమైన సంఘటన హీరోకి గాని, తల్లి తండ్రులకు గాని ఎవరికీ తెలీదు. హీరోకి గుర్తు ఉండదు. ఎవరో చెబితే అప్పుడు గుర్తుకువచ్చిందో.. లేక ఇమాజిన్ చేసుకుని అంత రివెంజ్ లోకి వెళ్ళాడో ఆడియన్స్ కి అర్ధం కాలేదు. ఇక నాగసౌర్య ప్రతీ సినిమాలో.. పక్కన ఉన్నవాళ్లు పొగిడినా, పొగడక పోయినా నిజంగానే బాగుంటాడు. ఆడియన్స్ మంచి హీరోని చూస్తున్న ఫీల్ అవుతారు. ఇందులో ఎంత షర్ట్ విప్పి ఎన్ని సార్లు హైలెట్ చేసుకున్నా యావరేజ్ గానే ఉన్నాడు. మొత్తం మీద సినిమా బిలో యావరేజ్ గా ఉంది. అయితే చివరగా ఈ సినిమాలో దర్శకుడు మంచిని మాత్రమే చూడాలి.. చెడుని చూడకూడదు అని చెప్పాడు కాబట్టి.. సినిమాలో నెగటివ్ పాయింట్స్ గురించి ఆలోచించకుండా ఎదో కాలక్షేపానికి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే.. వెళ్ళచ్చు.ఎందుకంటే కాలక్షేపానికి మనం తెలిసిన వాళ్ళ దగ్గరకి.. ఎప్పుడు మాట్లాడే టాపిక్స్ మాట్లాడటానికి వెల్తూ ఉంటాం కాబట్టి దీనికి కూడా వెళ్ళచ్చని మంచిని మాత్రమే తీసుకుని వెళ్లడమే..

రేటింగ్ : 2/ 5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..