Naga Chaitanya: అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరిలో ఒక గొప్ప తనం ఉంది. అదేమిటంటే.. వీళ్ళ సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా ( Naga Chaitanya with polices video became viral ) కూడా.. ఇవన్నీ మరచిపోయేలా సరైన హిట్ కొడతారు. అందుకే వీళ్లిద్దరి ముఖంలో చిరునవ్వు చెదరదు సరికదా అందంలో కూడా ఎక్కడా తగ్గరు. నాగార్జున, నాగచైత్యన్య వీల్లద్దరి మొదటి సినిమాలు చూసి.. వీళ్ళేమి హీరోలో ఏమిటో అనుకున్నారు గాని, తరవాత వాళ్ళ గ్లామర్ చూసి అమ్మయిలు ఫిదా అయిపోయారు.
నాగార్జునకి చైతన్యకి ఆడ ఫాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు.నాగ చైతన్య నెక్స్ట్ సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న కస్టడీ సినిమా మే 12 వ తేదీ థియటర్స్ కి వస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమాలో మరొక ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో చైతు పేరు శివ. టీజర్ లో ఈ పేరు వినగానే అక్కినేని అభిమానులకు నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ సినిమా గుర్తుకువచ్చింది. ఈ సినిమా ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసినదే.
కస్టడీ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండటంతో.. భారీగా ప్రమోషన్ పనుల్లో మునిగిపోయారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం నాగచైతన్య బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాను సూపర్ హిట్ చెయ్యాలనే తలంపుతో ఎంతో కష్టపడుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రియల్ పోలీస్ వాళ్ళతో కలిసి చైతు మీటింగ్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసాడు. అందులో నాగచైతన్య ( Naga Chaitanya with polices video became viral ) ను నిజమైన పోలీస్ లు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ చైతు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. అలాగే ఒక పోలీస్ మాట్లాడుతూ.. మీ సినిమా తడాకా చూశానని..
ఆ సినిమా చూసి అతను చాలా ఇన్స్పైర్ అయ్యి, పోలీస్ ఆఫీసర్ ని అయ్యానని చెప్పాడు. ఆ తర్వాత చైతు తో పోలీస్ వాళ్ళు అందరూ కలిసి, నిజమైన పోల్స్ ట్రైనింగ్ లో ఏమేమి చేస్తారో అవన్నీ చేయించారు. అందులో భాగంగా పాపం నాగ చైతన్య గోడలు కూడా దూకాడు. తాడు నిచ్చెనలు ఎక్కాడు, పరుగులు తీసాడు, దండీలు కూడా తీసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. చైతూతో పోలీస్ లు చెడుగుడు ఆడారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని అభిమానులు అయితే కస్టడీ సినిమా పై భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.