Spy Pre-Release Event: ప్రముఖ సినీ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడుగా మొట్టమొదటిసారిగా పరిచయం అవుతున్న సినిమా స్పై. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ గత కొంతకాలంగా మంచి ( Spy Pre-Release Event ) సక్సెస్ బాటలో వెళ్తున్నాడు. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఇటీవల రిలీజ్ అయిన 18 పేజెస్ సినిమా వినూత్నమైన కథతో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అలాగే స్పై సినిమా కూడా ఒక మంచి మూలంతో సినిమాని మొదలుపెట్టి.. సినిమా తీసిన విధానం కూడా హాలీవుడ్ లెవెల్ లో ఉన్నట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది.
స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చివరలో కనిపించలేదు అన్న విషయం హిస్టరీలో అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఏమయ్యారు అనే దానిమీద ఇన్వెస్టిగేషన్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి ఏమో. ఈ క్రమంలో ఒక మంచి పాయింట్ పట్టుకొని నిఖిల్ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ చాలా ఆత్రుతగా ( Spy Pre-Release Event ) ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగచైతన్య స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది.ఈ సినిమాపై టీజర్ ట్రైలర్ ఎంత భరోసానిచ్చాయో.. ఈ ఈవెంట్ కూడా అంతగానే భరోసానిచ్చింది. అందులో భాగమైన ప్రతి ఒక్కరూ ఎంతో కాన్ఫిడెన్స్ గా కనిపించారు.
ఇక ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ.. తన కథ చెప్పగానే నిఖిల్ చేసిన ప్రోత్సాహానికి.. ఈ సినిమా తీసేందుకు అంగీకరించిన నిర్మాత రాజశేఖర్ రెడ్డికి స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నాడు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగచైతన్య ని ఆహ్వానించిన ( Spy Pre-Release Event ) వెంటనే ఆయన అంగీకరించి వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు అని చెప్పారు. నాగచైతన్యలో ఉన్న డీసెన్సీ అంటే ఆయనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. ఇ ఈ సినిమా షూటింగ్ లాస్ట్ 12 రోజులు రాత్రి పగలు నిద్ర లేకుండా అన్నపూర్ణ స్టూడియోలో కంప్లీట్ చేశామని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఇక స్పై సినిమా గురించి నిఖిల్ గురించి నాగచైతన్య కొన్ని మాటలు మాట్లాడారు. అవి విని అభిమానులకు చాలా హ్యాపీ ఫీలయ్యారు.
ఇక ఈ సినిమాపై, నిఖిల్ పై నాగచైతన్య మాట్లాడుతూ.. హ్యాపీడేస్ మూవీ నుంచి నిఖిల్ ని గమనిస్తూనే ఉన్నాను. నిఖిల్ వెళ్లే దారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి సినిమాని ఎంతో బాగా ప్లాన్ చేసుకొని.. అతను ఎంచుకునే విధానాన్ని నేను చాలా అభినందిస్తున్నాను అని నాగచైతన్య చెప్పాడు. స్వామి రారా కార్తికేయ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ని సెట్ చేశాడని.. మొన్న కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుని.. అతను చాలామంది నటులకు స్ఫూర్తి అయ్యాడని చెప్పాడు చైతు. అలాగే ఇప్పుడు స్పై సినిమా కూడా మొత్తం కేవలం నిఖిల్ భుజం మీద వేసుకుని మోస్తున్నాడని.. హిట్ ఖచ్చితంగా అవుతుందని నాగచైతన్య చెప్పాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే అందులో ఉండే కొత్తదనం కనిపిస్తుందని కచ్చితంగా మరో హిట్టుని నిఖిల్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.