Naga Chaitanya : సమంత మరియు నాగ చైతన్య విడిపోవడం అనేది మన సౌత్ లో ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ విడిపోయి రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ వాళ్ళ గురించి సోషల్ మీడియా లో ప్రతీరోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది(Naga Chaitanya Revenge). అయితే పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బూస్టఫర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గా హిందీ లో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ గా నిల్చింది. తెలుగు లో వీళ్లిద్దరు భార్య భర్తలు అవ్వడం వల్ల ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసేందుకు కారణం అయ్యింది.
ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించినా శివ నిర్వాణ రీసెంట్ గా విజయ్ దేవరకొండ మరియు సమంత తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం చేసారు. ఈ సినిమా వచ్చే నెల 1 వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలు అయితే పెద్ద సెన్సేషనల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ చిత్రం పాటలే వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే మొన్న హైదరాబాద్ లో జరిగిన ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ లో,
సమంత ముందే ఈ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రం శివ నిర్వాణ దర్శకత్వం లోనే నాగ చైతన్య హీరో గా ఒక సినిమా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య పేరు వినగానే సమంత ముఖం మాడిపోయింది. కావాలని ఆయన నిర్మాతలతో స్టేజి మీద అలా చెప్పించాడా? అని అంటున్నారు నెటిజెన్స్(Naga Chaitanya Revenge). శివ నిర్వాణ అటు నాగ చైతన్య కి ఇటు సమంత కి ఎంతో మంచి సన్నిహితుడు. ఇతను వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. ఒకవేళ నాగ చైతన్య తో చెయ్యబోతున్న సినిమాలో సమంత ని హీరోయిన్ గా తీసుకుంటే మాత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో అనేది.
నాగ్ చైతన్య మాత్రం పెద్ద హిట్టులు లేక డీలాపడిపోయాడు అనే చెప్పాలి. తన చివరి చిత్రం కస్టడీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. దీనితో నాగ చైతన్య కొత్త యువ దర్శకులను, కొత్త స్టోరీ రైటర్ లను సంప్రదిస్తున్నాడు అంట. ఏదైనా ఒక డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటున్నాడు నాగ చైతన్య. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెపుతూ – టైం పట్టిన పర్లేదు కానీ ఈ సారి మంచి డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తాను అని చెప్పాడు అట.