Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం ఒక ముఖ్యమైన పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దురదృష్టం ఏమిటంటే నాగార్జున అందుకున్న సక్సెస్ ని ఆయన కొడుకులిద్దరూ కూడా అందుకోలేకపోతున్నారు. అఖిల్ సంగతి పూర్తిగా పక్కన పెడితే.. నాగచైతన్య యావరేజ్ హీరో ( Naga Chaitanya Pan India movie ) అయ్యాడు తప్పా.. స్టార్ హీరో అవ్వలేకపోతున్నాడు. కారణం సంచలనాత్మక బ్లాక్ బస్టర్ రికార్డ్స్ ని అతను ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో ఒక మంచి హిట్ లేక అనేక బాధలు పడుతూ ఉన్నాడు. అంతేకాకుండా పర్సనల్ లైఫ్ చూస్తే సమంతాను ప్రేమించి, పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి పెద్ద స్టార్స్ గా ఎదిగి..
అక్కినేని కుటుంబం నుంచి ఒక వెలుగు వెలుగుతారని అనుకుంటే ఇద్దరూ ఎవరికి వారు విడిపోవడమే కాకుండా.. ఇద్దరు కూడా ఫెయిల్యూర్స్ చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా ( Naga Chaitanya Pan India movie ) కూడా డిజాస్టర్ అవడంతో.. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ఇతరులను ఒక గొప్పతనం ఏంటంటే.. ఎవరికి వాళ్ళు.. వాళ్ళ కెరీర్లో సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. సమంత పాన్ ఇండియా సినిమా నటించేసింది. ఇప్పుడు నాగచైతన్య కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య హీరోగా ఒక సినిమాని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా గురించి నాగచైతన్య ఆ చిత్ర బృందం వారు శ్రీకాకుళం వెళ్లారు. ఎచ్చెర్ల మండలంలో వీళ్లంతా పర్యటించారు. మీడియా వాళ్లతో నాగచైతన్య మాట్లాడుతూ.. సుమారు కొన్ని నెలల క్రితం చందు మండేటి నా దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు. అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది అందుకే ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పేసాను అని అని అన్నాడు. ఈ సినిమా ( Naga Chaitanya Pan India movie ) నిజజీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ మీద కథ రాసి, సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంటుందంట. సిక్కోలు మత్స్యకారుల యాస, భాష వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం కోసం ఆ ప్రాంతానికి ఆ చిత్ర బృందం అంతా వెళ్ళిందంట. ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందంట. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్ళిన పాక్ పోస్టు గార్డుకు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది అంట.
అక్కడ నుంచి భారతదేశానికి అతను ఎలా వస్తాడు అనే దానిపై సినిమా రూపొందిస్తున్నారంట. ఇది ఇలా ఉంటే సమంత సినిమా ఖుషి సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఒకపక్క నాగచైతన్య అభిమానులు మా హీరో పాన్ ఇండియా సినిమా తీయబోతున్నారట అంటూ.. మరోపక్క సమంత సినిమా పోయినట్టు మా హీరోది మాత్రం పోదని అంటున్నారు. సమంత పాన్ ఇండియా సినిమా శాకుంతలం పక్కన పెడితే.. ఇప్పుడు ఖుషి సినిమాపై మాత్రం అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కనీసం ఖుషి సినిమా రికార్డ్స్నే నాగచైతన్య ఈ పాన్ ఇండియా సినిమాతో కొడితే చాలు గొప్ప అని మరోపక్క కొంతమంది వాపోతున్నారు. ఏదేమైనా అందరి సినిమాలు మంచి కంటెంట్తో వచ్చి హిట్ అవ్వాలనే కోరుకోవడం మంచిదని సహజమైన ప్రేక్షకులు కోరుకుంటున్నారు.