Home Cinema Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరో తెలుసా..?? ఈ పెళ్లికి ట్విస్టుల...

Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరో తెలుసా..?? ఈ పెళ్లికి ట్విస్టుల మీద ట్విస్టులు..

Naga Chaitanya: అక్కినేని నాగార్జున వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి జోష్ సినిమా ద్వారా అడుగు పెట్టాడు నాగచైతన్య.. ఇక ఆ తర్వాత సమంత హీరోయిన్ గా నటించిన ఏం మాయ చేసావే సినిమాలో నటించిన నాగచైతన్య ఏం మాయ చూసాడో మరి సమంతని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు నాలుగేళ్ళు కాపురం చేసిన తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు..  దాదాపు ఏడాదిన్నరకు పైగా అవుతుంది విడాకులు తీసుకుని.. సామ్ తో విడిపోయాక చైతు ఎక్కువగా శోభితతో (Naga Chaitanya Getting Ready) కనిపిస్తున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత సంవత్సర కాలం నుంచి ఎన్నోసార్లు వీరిద్దరూ కెమెరాలకు కంట పడ్డారు..

See also  Allu Arjun: పార్టీలో ఆ హీరోయిన్ గురించి అల్లు అర్జున్ ఇంత నీచంగా మాట్లాడాడా..

naga-chaitanya-getting-ready-for-his-second-marriage-with-shobitha-here-are-proofs

వీళ్లిద్దరి మధ్య డేటింగ్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా..వీళ్ళిద్దరూ కలిసి హాలిడే ట్రిప్ కూడా వెళ్లాలంటూ వార్తలు వినిపించాయి. దానికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. చైతు, శోభిత కలిసి లండన్ లోని ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్లారు..అక్కడ అదే సమయంలో చెఫ్ గా ఉన్న తెలుగు వ్యక్తి సురేంద్రమోహన్, నాగచైతన్యతో ఓ ఫోటో దిగి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో వెనకాలే టేబుల్లో కూర్చున్న శోభిత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె ముఖం కనపడకుండా హ్యాండ్ అడ్డుపెట్టుకొని కవర్ చేసేందుకు ప్రయత్నించినా ఫోటో ప్రస్తుతం క్లియర్ గా మనకు కనిపిస్తుంది.

See also  Prabhas : మరోసారి ఆసుపత్రి పాలైన ప్రభాస్ అక్కడ సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

naga-chaitanya-getting-ready-for-his-second-marriage-with-shobitha-here-are-proofs

ఇంకేముంది.. ఇక ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఈ న్యూస్ మార్మోగిపోతుంది. చైతు స్నేహితులే కాక ఇండస్ట్రీలో ఉన్న సినీ వర్గాల వారు చైతు ప్రేమలో పడ్డాడని చెప్తున్నారు.. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని అనుకుంటున్నారు. అయితే శోభిత మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఆమె 1993వ సంవత్సరంలో మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో జన్మించింది. వీళ్లది బ్రాహ్మణ కుటుంబం. వైజాగ్ లోని లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో ఆమె విద్యాభ్యాసం ముగిసింది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ లో పట్టా పొందింది.

naga-chaitanya-getting-ready-for-his-second-marriage-with-shobitha-here-are-proofs

ఆమెకు మన భారతీయ సాంప్రదాయ నృత్యాలు అయినటువంటి కూచిపూడి భరతనాట్యంలో మంచి పట్టు సాధించిన డాన్సర్ గా గుర్తింపునుండింది. మొదటగా బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అడవిశేష్ తో ఆమె చేసిన గూడచారి, మేజర్ రెండు సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా మంచి దూకుడు కొనసాగిస్తుంది. దీంతో ఈసారి నాగచైతన్య చేసుకోబోయే రెండవ పెళ్లి అచ్చ తెలుగు అమ్మాయిని.. అందులో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి శోభితను (Naga Chaitanya Getting Ready) పెళ్లి చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో గుసగుసలు మోత మోగిపోతుంది..