Naga Chaitanya Finally Reveals: అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలో జోష్ చిత్రంతో పరిచయమయ్యాడు అక్కినేని నాగచైతన్య. ఇక మనందరికీ తెలుసు సముద్రంలో ఆటు పోట్ల వలె ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాట్లు అనేవి కచ్చితంగా ఉంటాయి. అలా తన మొదటి చిత్రం జోష్ అనుకున్నంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత సమంతతో జోడిగా నటించిన ఏం మాయ చేసావే చిత్రం సూపర్ హిట్ అవడంతో చైతుకి మంచి గుర్తింపు లభించింది.
ఇక ఆ చిత్రం తర్వాత నుండి హిట్లకు, ఫ్లాప్ లకు సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు చైతు.. ఇక ప్రస్తుతం తన తదుపరి విడుదలయ్యే చిత్రం కష్టడి కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఆ రోజు దగ్గరకు రానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం ఈ నెల 12 వ తారీఖున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రం విడుదలకు సంబంధించి ఎన్నో ప్రమోషన్లో పాల్గొంటూ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇక ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతుకి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే ఎదురయ్యాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన విషయం.. మీరు సినిమాల విషయంలోనైనా లేక డివోర్స్ విషయంలోనైనా పశ్చాత్తాప పడ్డారా అని అడగగా.. దీంతో చైతు నేను రెండు మూడు సినిమాలు విషయంలో కాస్త రిగ్రిట్ గా ఫీల్ అయ్యాను అని తెలిపాడు చైతు. అలాగే యాంకర్ మీకు ఎవరైనా సీక్రెట్ క్రష్ ఉన్నారా అని అడగ్గా.. నాకు సీక్రెట్ అంటూ ఎవ్వరూ లేరు. ఒకవేళ అలా ఉంటే కచ్చితంగా నేను చెప్తాను.. (Naga Chaitanya Finally Reveals)
కానీ ఒక విషయం ఈ మధ్యకాలంలో నేను హాలీవుడ్ లోని బాబిలోన్ అనే చిత్రం చూశాను, అందులో నటించిన మార్గోట్ రాబీ ఆమె నటనకు నేనైతే ఫిదా అయిపోయ్యాను. ఇక నాకైతే ప్రస్తుతం ఆమె పై నా ఇష్టం పెరిగిపోయింది. ఆమె నా క్రష్ అని చెప్పొచ్చు అంటూ నాగచైతన్య తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక నాగచైతన్య, శోభిత ధూళిపాల మధ్య గత ఆరు సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అనే ఆ కారణం చేతనే సమంత నాగచైతన్య మధ్యలో గొడవలు వచ్చి వీళ్ళిద్దరూ విధిపోయాడంటూ ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు మనం వింటూనే ఉన్నాం..