Home Cinema Naga Chaitanya – Samantha : వామ్మో.. విడిపోయాక ఇన్నాళ్లకు డబ్బు కోసం మళ్ళీ కలిసిపోతున్న...

Naga Chaitanya – Samantha : వామ్మో.. విడిపోయాక ఇన్నాళ్లకు డబ్బు కోసం మళ్ళీ కలిసిపోతున్న చైతు సమంత..

naga-chaitanya-and-samantha-going-to-meet-first-time-for-business-after-the-divorce

Naga Chaitanya – Samantha : నాగచైతన్య, సమంత వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో ఇష్టపడి కొంతకాలంగా వాళ్ళ ప్రేమను ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత పెద్దవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్న వీళ్ళు.. పెళ్లి తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. దానికి కారణం ఏమిటి ( Naga Chaitanya and Samantha meet ) అనేది వాళ్లయితే చెప్పలేదు కానీ.. ఇక అభిమానులు, నెటిజనులు, సినిమా రంగంలో అందరూ ఎవరికి వారు ఊహించుకోగలిగేది వాళ్ళు ఊహించుకుంటూ.. చెప్పుకుంటూనే వచ్చారు. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత ఎవరి కెరీర్ పై వాళ్ళు శ్రద్ధ పెడుతూ పనిచేసుకుంటూ వెళ్తున్నారు.

Naga -Chaitanya-Samantha-meet

నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు రాలేదు. ఎన్నో సినిమాలు చేశారుగాని బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టలేకపోయారు. మరి దానికి కారణమేమిటో తెలీదు గానీ.. అభిమానులైతే వీళ్లిద్దరూ కలిసి ఉంటేనే అదృష్టం. విడిపోతే ఇద్దరికీ మంచిది కాదు అని.. ఇలాంటి డైలాగ్స్ ఐతే ( Naga Chaitanya and Samantha meet ) మాత్రం చాలా అంటూనే ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే విడాకుల తర్వాత సమంతకి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. వయోసైటిస్ అనే జబ్బు వచ్చి ఆమె చాలా సమస్యలను ఎదుర్కొంది. అయినా కూడా ఆ జబ్బును ఎదురుకొని దానికి సంబంధించిన డైట్, ఎక్సర్సైజులు అన్ని చేసి రెస్ట్ తీసుకొని.. తనని తాను మళ్ళీ మనిషిని చేసుకుంది.

See also  Samantha: చైతన్య కంటే ఎంతో విలువైనది రీసెంట్ గా వదిలేసిన సమంత ! ఫాన్స్ కి కోపం నెటిజన్స్ కి పండగ.

Naga -Chaitanya-Samantha-after-divorce

ఒకపక్క జబ్బుతో, మరోపక్క సినిమాల బిజీతో ఆమె సతమతమై.. చివరికి ఖుషి సినిమా తర్వాత ఆమె అన్ని ఆపి, అమెరికా వెళ్లి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వస్తాను.. నాకు సినిమాలో షూటింగ్ నుంచి బ్రేక్ కావాలని వెళ్ళింది. అయితే ఇప్పుడు నాగచైతన్య, సమంత పై ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డైవర్స్ ( Naga Chaitanya and Samantha meet ) అయిన ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలవబోతున్నారని. ఇంతకీ కలవబోతున్నారంటే కలిసి బ్రతకడానికి కాదు. మంచి లాభదాయకమైన వ్యాపారం కోసం కలుస్తున్నారు అంట. నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒక సపరేట్ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేసేవారు. అలాగే వాళ్ళిద్దరూ సంపాదనతో ఒక స్థలం కొనుక్కున్నారంట.

See also  Tamanna : రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగ చైతన్య ల సూపర్ సీక్రెట్ బయట పెట్టిన తమన్నా!

Naga -Chaitanya-Samantha-business

ఆ స్థలంలో ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని.. అందులో వీళ్ళిద్దరూ కలిసి హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేయాలని అనుకున్నారంట. హైదరాబాదులో అప్పుడు ఇద్దరు పేరుమీద కొనుక్కున్న స్థలం, ఇద్దరి సంపాదనతో కొనుక్కున్నది ఇప్పుడు ఇంకా ఇల్లు కట్టుకొని ఒకే చోట ఉండే పరిస్థితి లేదు కాబట్టి.. అప్పుడు కొన్న దానికంటే ఇప్పుడు చాలా బాగా లాభాలు రావడంతో.. ఆ స్థలాన్ని అమ్మేసి ఎవరు భాగం వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారంట. ఆ స్థలం వేరే ఒకతను కొనడానికి ముందుకు వస్తే.. అది అమ్మడానికి ఇద్దరు సంతకం పెట్టడానికి.. ఇద్దరు కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. మొత్తానికి ఈ సూపర్ జంట కలిసి బ్రతకడానికి కాకపోయినా లాభదాయకమైన వ్యాపారం కోసమైనా ఒకసారి మళ్లీ కలుస్తారన్నమాట. చూసారా ఇద్దరు కలిసి ఒక చోట స్థలం కొంటే అదే అంత బాగా వృద్ధి చెందింది కదా అంటే కలిసి బ్రతికితే వీళ్ళ జీవితం ఇంకెంత బాగుంటుంది అని అభిమానులు అయితే అనుకుంటున్నారు.