Mrunal Spoke: మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా క్లాసికల్ మూవీ డైరెక్టర్ అను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సీత రామమ్. ఇక ఈ చిత్రం విడుదలై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ ఈ చిత్రం యొక్క హీరోయిన్ మృణాల్ ఎమోషనల్ పోస్ట్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఎంత అందమైన ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రం సీతారామమ్ లో నన్ను సీతగా పరిచయం చేసినటువంటి దర్శకుడు హనుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ చిత్రంతో నా కెరియర్ లోనే మొదటి మూవీతో తెలుగింటి అమ్మాయిల నన్ను మీరందరూ ఆదరించి అమితమైన ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రం రూపుదిద్దుకుని నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఈ చిత్రం యొక్క చిత్ర బృందానికి తెలుగు సినీ ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ మృనాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అదేంటంటే.. మై డియర్ ఆడియన్స్ నటిగా నా తొలి తెలుగు చిత్రం సీతారామమ్ నేను ఎన్నో ఏళ్ల నుంచి పడ్డ కష్టం శ్రమ కన్న కలలను మీరు వాటన్నిటికీ మించి నాపై చూపించిన ప్రేమాభిమానాలు నేనెప్పటికీ మర్చిపోలేను. నన్ను మీ తెలుగుంటి ఆడపిల్లల ఆదరించినందుకు ఈ ప్రయాణంలో నా పై అమితమైన ప్రేమను కురిపించినందుకు మీకు కృతజ్ఞతలు.
ఇక ఇది నాకెంతో ప్రత్యేకం మరెన్నో ఏళ్ళ పాటు మరెన్నో పాత్రలతో విభిన్నమైన వినోదాలను మీకు అందిస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నానంటూ ఆమె తెలిపారు. అయితే ఈ మాటలు విన్న వారంతా ఆనందంగా వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం వినోదం అంటే బికినీ వేసుకొని ఊరేగడం కాదు అంటూ సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరదే విధంగా చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ నా నుంచి సీతా బెస్ట్ వెర్షన్ స్కీన్ పైకి పరిచయం చేసినటువంటి డైరెక్టర్ అనురాగవపూడి కి ఈ మొత్తం ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తింపులో చేసిన,
హీరో దుల్కన్ సల్మాన్ తో పాటు చిత్ర బృందం మొత్తానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ పెట్టడంతో పాటు.. సీతారామమ్ మేకింగ్ వీడియోని మొత్తం కూడా ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తూ అలరిస్తూ ఆకట్టుకుంటుంది. మరో వైపు చిత్ర నిర్మాణ సంస్థ సైతం స్పెషల్ వీడియోని విడుదల చేసింది వైజయంతి మూవీస్ స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున బ్లాక్ బస్టర్ చేసుకొని వసూళ్ళ సునామిని సృష్టించింది. ఇక ప్రస్తుతం మృణాల్ (Mrunal Spoke) హాయ్ నాన్నతో పాటు తెలుగులో రౌడీబాయ్ పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తో చిత్రంలో నటిస్తున్నది.